యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పొట్టేల్.. విభిన్నమైన కథతో విభిన్నమైన టైటిల్ తో ప్రేక్షకులను ఆసక్తిపరిచిన ఈ సినిమా ట్రైలర్ మరింత ఆకట్టుకుంది. డైరెక్టర్ సాహిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యువ చంద్ర హీరోగా ఇందులో నటించారు. సీనియర్ నటుడు అజయ్ ఇందులో కీలకమైన పాత్రలో నటించారు. మంచి పాపులారిటీతో ఈరోజు పొట్టేల్ సినిమా ప్రేక్షకులం ముందుకు వచ్చింది మరి ఏ విధంగా ఆకట్టుకుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో పటేల్ వ్యవస్థ పాలిస్తున్న సమయంలో పెద్ద గంగాధరి (యువచంద్ర) చదువుకోవాలని తపనతో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటారు. చివరికి తనకు ఇష్టం లేకపోయినా గొర్రెలను కాస్తు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇక తను నివసిస్తున్న గ్రామంలో అమ్మవారికి బలి ఇచ్చే పొట్టేల్ని పెంచుతూ ఉంటారు. పెద్ద గంగాధరి భార్య పాత్రలో బుజ్జమ్మ (అనన్య) నటించింది. అయితే పెద్ద గంగాధరి చదువుకోలేదని తన కూతురునైనా ఎలాగైనా చదివించాలని తన కూతురు సరస్వతి (తనస్వి చౌదరి) చదివించాలని పట్టుదలతో ఉంటారు. ఇక అదే గ్రామానికి చెందిన పెద్ద బాలమ్మ పూనే స్వామి పటేల్ (అజయ్) తన గ్రామంలో ఉండే వారందరి మీద కూడా పెత్తనం చాలా ఇస్తూ ఉంటారు. తను చెప్పింది వేదం అన్నట్లుగా చేస్తూ ఉంటారు. తనకి బాలమ్మ పూనుతుందని ఏకైక కారణంతో ఆ ఊరి ప్రజలు ఈయనను ఏమనరట. అయితే ఈ బాలమ్మ తల్లి పొట్టేలుని ఆవహించి పెద్ద గంగాధర్ ముందు దోషిగా నిలబెడతారట.. అయితే పటేల్ కి పెద్ద గంగాధర్ అంటే ఎందుకు కోపం పెద్ద గంగాధర్ ఎదుర్కొన్న కష్టాలు ఏంటి తన కూతురు చదువు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తెలియాలి అంటే థియేటర్కు వెళ్లాల్సిందే.


సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగానే థియేటర్లో కూడా చాలా రస్టిక్ గా ప్రేక్షకుల ను ఆకట్టుకుందట. అయితే ఇలాంటి చిత్రాలు ఎక్కువగా తమిళంలో కూడా వస్తూ ఉంటాయని ప్రేక్షకులు తెలుపుతున్నారు. డైరెక్టర్ సాహిత్ కథను చాలా అద్భుతంగా తీసుకువచ్చారని తెలియజేస్తున్నారు. మూఢనమ్మకాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతారు అనే విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు. అయితే చివరి నిమిషంలో మాత్రం ఇందులో హీరో చాలా బలహీనుడు గానే చూపించారు ఇది కాస్త అభిమానులను నిరాశపరిచిందట. ఈ సినిమాలో ఎక్కువగా చదువు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందట.

నటీనటుల విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా అజయ్ పాత్ర అద్భుతంగా ఉందని తన పాత్రలు జీవించి పోయారట. ముఖ్యంగా ఇందులోని కొన్ని సన్నివేశాలు నటుడు అజయ్ తప్ప మరెవరు చేయలేరు అనే విధంగా నటించారు. ఇక హీరో యువచంద్ర కూడా తను నటనతో బాగానే ఆకట్టుకున్నారట. అయితే అనన్య నటన కూడా అద్భుతంగా ఉందని తెలుపుతున్నారు. మొత్తానికి 1980 కాలాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని తెలుపుతున్నారు. మొత్తానికి అనన్య నాగళ్ళ ఈ సినిమాతో సక్సెస్ అయినట్టుగా అభిమానులు తెలుపుతున్న పూర్తి రివ్యూ రావాలంటే మరొక కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: