‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత రామ్ చరణ్ నుండి రాబోతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ మూవీ కావడంతో ఈమూవీ పై క్రేజ్ తో పాటు అంచనాలు కూడ బాగానే ఉన్నాయి. అయితే ఈమూవీ నిర్మాణం దాదాపు మూడు సంవత్సరాలు పాటు జరగడంతో నిర్మాత దిల్ రాజ్ కు ఈమూవీ ప్రాజెక్ట్ పై 400 కోట్లకు పైగా ఖర్చు అయింది అంటూ వార్తలు వస్తున్నాయి.



ఈమూవీ మార్కెట్ ను శంకర్ దర్శకత్వంలో ఈమధ్యనే విడుదలైన ‘ఇండియన్ 2’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఎంతవరకు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో తన అంచనాలను నిలబెట్టుకుంటాడు అన్న సందేహాలు మరికొందరిలో కల్గుతున్నాయి. ‘సంక్రాంతి’ సీజన్ లో వచ్చే సినిమాల పై ఇప్పటికీ క్లారిటీ లేదు. దీనితో ఇలా ‘గేమ్ ఛేంజర్’ తప్ప మరొక పెద్ద సినిమా రాకూడదని ఈమూవీ నిర్మాత దిల్ రాజ్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇదే సీజన్ కు రావలసి ఉన్న అనేక సినిమాల పై క్లారిటీ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లు ‘గేమ్ ఛేంజర్’ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఈమూవీ బిజినెస్ చాల నెమ్మదిగా జరుగుతున్నట్లు టాక్.



ఈమూవీతో పాటు బాలకృష్ణ బాబి ల మూవీ వెంకటేష్ అనీల్ రావిపూడి ల మూవీలతో పాటు సందీప్ కిషన్ తమిళ టాప్ హీరో అజిత్ ల సినిమాలు కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈసినిమాలలో ఎన్ని సినిమాలను ‘సంక్రాంతి’ పోటీ నుండి ‘గేమ్ ఛేంజర్’ నిర్మాతలు తప్పించగలిగితే అంత ‘గేమ్ ఛేంజర్’ కు లాభం అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో కొందరు వ్యక్త పరుస్తున్నారు.



ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే ‘గేమ్ ఛేంజర్’ మూవీ 150 కోట్ల వరకు బిజినెస్ చేసింది అని వస్తున్న వార్తలను బట్టి ఈమూవీ పై ఇండస్ట్రీ వర్గాలలో ఏర్పడిన క్రేజ్ అర్థం అవుతున్నప్పటికీ రామ్ చరణ్ స్టామినాకు పరీక్ష పెట్టే సినిమాగా ‘గేమ్ ఛేంజర్’ మారింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..





మరింత సమాచారం తెలుసుకోండి: