ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పహద్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఈ మూవీ లో అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.

మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 అనే సినిమాని రూపొందిస్తున్నారు. చాలా కాలం క్రితం ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు. ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే నిన్న ఈ మూవీ యూనిట్ విలేకరులతో ముచ్చటించింది. అందులో భాగంగా ఈ సినిమాను డిసెంబర్ 6 వ తేదీన కాకుండా అంతకంటే ఒక రోజు ముందుగా అనగా డిసెంబర్ 5 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఆగస్టు 15 వ తేదీన వాయిదా వేశాక ఈ మూవీ ని ఏ తేదీన విడుదల చేయాలా అనే దానిపై పెద్ద స్థాయిలో చర్చలు జరిపాము. అందులో భాగంగా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయాలి అనుకున్నాం. కానీ ఆ తేదీన లయన్ కింగ్ సినిమా విడుదల కానుంది. దానితో మల్టీప్లెక్స్ థియేటర్లలో స్క్రీన్స్ దొరకడం కష్టం అనే ఉద్దేశంతో డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకు డిసెంబర్ 6 వ తేదీన మూవీ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాం అని ఈ సినిమా నిర్మాత నవీన్ యెర్నేని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa