వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలచే సినిమాలు ఏవి అనే విషయంలో రాను రాను క్లారిటీ వచ్చేస్తుంది. కొంత కాలం క్రితం సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంబర సినిమాతోనూ , వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీతోనూ , సందీప్ కిషన్ మజాకా అనే సినిమాతోనూ బరిలో దిగబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఇక ఆ తర్వాత అనూహ్యంగా విశ్వంభర మూవీ సంక్రాంతి భరి నుండి తప్పుకుంది. ఆ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఆ తర్వాత వెంటనే బాలయ్య హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను సంక్రాంతి పండగ బరిలో నిలపబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇక్కడి వరకు ఓకే కానీ అందరూ కూడా సంక్రాంతి కి అందరి కంటే ముందు వచ్చి సంక్రాంతి పండుగ సీజన్ ను అదిరిపోయే రేంజ్ లి వాడుకోవాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గేమ్ చేంజర్ మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో ఈ మూవీ నే వచ్చే సంవత్సరం సంక్రాంతి సీజన్ కి అన్ని సినిమాలు కంటే ముందు వచ్చి సంక్రాంతి సీజన్ ను ఫుల్ గా వాడుకోబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇకపోతే బాలయ్య , చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా కంటే ఒక రోజు ముందు అనగా జనవరి 9 వ తేదీనే తన సినిమాను రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అదే కానీ జరిగినట్లయితే బాలయ్య సినిమాకు భారీ ఎత్తున థియేటర్లు లభించి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇలా మొదటి రోజు అడ్వాంటేజ్ కోసం ఓ వైపు చరణ్ , మరో వైపు బాలయ్య చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరిలో మొదట సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: