యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈమధ్య ఈయన వరుస పెట్టి సినిమాలు తీస్తూ హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కామెడీ చిత్రం స్వాగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్వాగ్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. శ్రీ విష్ణు ఈ సినిమాలో సింగ, యయాతి, భవభూతి, కింగ్ భవభూతి అనే మొత్తం నాలుగు పాత్రలలో కనిపించారు.


నాలుగు క్యారెక్టర్లలో నాలుగు డిఫరెంట్ షేడ్స్, భిన్నమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ముఖ్యంగా రెండు కాలాల మధ్య సాగే కథగా ఈ సినిమా అనిపించింది.  ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస విజయాన్ని అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు స్వాగ్ తో హ్యాట్రిక్ అందుకున్నాడు. ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహించగా.. రీతూ వర్మతో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా వెండితెరపై కనిపించి అబ్బురపరిచింది. ఇందులో ప్రముఖ కమెడియన్ సునీల్ కూడా కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఇలాంటి తరహాలో ప్రేక్షకులకు కనిపించని శ్రీ విష్ణు ఇప్పుడు తను నట విశ్వరూపాన్ని చూపెట్టి సర్ప్రైజ్ చేశారు.


ఇదిలా ఉండగా మరోవైపు సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ సినిమా.. ఈ సినిమా హక్కులను ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమా థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు ఓటీటీలో చూసేయవచ్చు. ఏదేమైనా అక్కడ మంచి విజయం అందుకున్న స్వాగ్ ఇప్పుడు ఓటీటీ లో కూడా భారీ రికార్డు సృష్టిస్తుందని ఓటీటీ నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: