అయితే సాయి పల్లవి కూడా ఒకప్పుడు పొట్టి డ్రెస్ లు వేసేది . తొడలు కనిపించేలా డ్రస్సులు వేసుకునేది. కానీ ఒకరోజు నైట్ ఆమె ఇంకా పొట్టి డ్రస్సులు వేసుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యిందట .దానికి కారణం కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రీసెంట్ గా ఆమె నటించిన సినిమా "అమరన్". తెలుగు మలయాళం లో సినిమాలు చేస్తూ బిజీగా ముందుకు వెళ్తున్న సాయి పల్లవి నటించిన లెటేస్ట్ "అమరన్" సినిమా అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సాయి పల్లవి కు మళ్లీ తాను ఎందుకు పోటీ డ్రెస్ లు వేసుకోదు అన్న ప్రశ్న ఎదురైంది . దానికి రీజన్ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. " నేను జార్జియాకి వెళ్ళాను ఎంబిబిఎస్ చదువుకోవడానికి.. అప్పుడు అక్కడ టాంగో డాన్స్ చాలా చాలా ఇష్టంగా నేర్చుకున్నాను . డాన్స్ వేయడానికి పొట్టి డ్రెస్ వేసుకోవాలి . అందుకే అలాంటి డ్రెస్ వేసుకున్నాను. ఆ సమయంలో నాకు కూడా తెలుసు. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో అని. కానీ డాన్స్ కోసం పర్వాలేదు అనుకున్న . కానీ నా మొదటి సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది నా పాత వీడియోలను షేర్ చేస్తూ దారుణాతి దారుణంగా వల్గర్ గా కామెంట్లు పెట్టారు . అది చూసి మా అమ్మానాన్న చెల్లి చాలా ఫీలయ్యారు. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇకపై పోటీ డ్రెస్సులు వేసుకొని మా అమ్మానాన్నలను ఇబ్బందికర సిచువేషన్స్ క్రియేట్ చేయకూడదు అని.. అప్పటినుంచి ఇప్పటివరకు అలాంటి డ్రెస్ వేసుకున్నిందిఏ లేదు . శేఖర్ కమ్ముల గారి ఫోర్స్ మీదనే ఫిదా సినిమాలో ఒక్క సీన్ కి మాత్రమే ఎలాంటి డ్రెస్ వేసుకున్నాను. అయితే అది కూడా చాలా నీట్ గా తెరకెక్కించారు "అంటూ చెప్పుకొచ్చింది..!