అన్ స్టాపబుల్ షో గెస్టులు ఎవరో ముందుగానే రివీల్ అవుతోంది. ఈరోజు ప్రసారమయ్యే ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు హజరవుతుండగా సెకండ్ ఎపిసోడ్ కు సూర్య హాజరవుతున్నారు. అయితే ఈ షోకు నాగార్జున, సమంత, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మరి కొందర్ క్రేజీ హీరోలు ఈ షోకు ఎప్పుడు హాజరవుతారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. గెస్ట్ లను రిపీట్ చేయడం అన్ స్టాపబుల్ షోకు మైనస్ అవుతుంది.
అన్ స్టాపబుల్ సీజన్4 కు ప్రమోషన్స్ భారీ స్థాయిలోనే జరుగుతుండగా ఈ ప్రమోషన్స్ షోకు ఎంతగా ప్లస్ అవుతాయో చూడాలి. సీజన్4 ను కచ్చితంగా సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఈ షో నిర్వాహకులపై ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. చిరంజీవి ఈ షోకు హాజరు కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఈ షోకు పోటీగా ఇతర ఓటీటీలలో కూడా టాక్ షోలు ప్రదర్శితం కానున్నాయి.
అన్ స్టాపబుల్ షో సీజన్4 కూడా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. కెరీర్ పరంగా వరుస విజయాలను సొంతం చేసుకున్న బాలయ్య ప్రొఫెషనల్ కెరీర్ పరంగా కూడా అంతకంతకూ ఎదుగుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అన్ స్టాపబుల్ షో సీజన్4 కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.