టాలీవుడ్ కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం క.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ ,సందీప్ డైరెక్షన్లో తెరకెక్కించారు. కిరణ్ అబ్బవరం వివాహం తర్వాత రాబోతున్న కిరణ్ అబ్బవరం సినిమా కావడంతో పాటుగా సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా భారీ పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. కానీ పాటలకైతే పెద్దగా రెస్పాన్స్ రాలేదు.. కానీ ట్రైలర్ చూసిన వారంతా కూడా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే విధంగా మాట్లాడుతున్నారు.


ట్రైలర్ విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం (వాసుదేవ్)ఎంట్రీ క్రిష్ణగిరి అనే ఊర్లో పోస్ట్ మ్యాన్  గా పనిచేస్తూ ఉంటారు.. ఆ తర్వాత అదే ఊర్లో అభినయ వాసుదేవ్ అనే అమ్మాయితో ప్రేమలో పడతారు.. అలా ఉత్తరాలు పంచుకుంటూ ప్రేమాయణం కొనసాగిస్తున్న హీరో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఒక ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని ఎలా మారుస్తుంది ..ఆ ఉత్తరంలో ఏముంది అనే విషయం తెలియాల్సి ఉంది.. వాసుదేవ్ నీ ఎందుకు బెదిరిస్తూ ఉంటారు. ఆ తరువాత ఆ ముసుగు వ్యక్తి గ్యాంగ్ కూడా వాసుదేవ్ ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరిలో కూడా ఒక ట్విస్ట్ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది.


ఇందులో హీరోయిన్స్ గా తన్వి రామ్, నయన్సారిక నటిస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా క కావడం చేత ఈ సినిమా పైన అభిమానులకు భారీ ఎక్సపర్టేషన్ ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీయర్ కు  ఉపయోగపడుతుందా చూడాలి. ట్రైలర్తో హైట్ పెయిన్ చేసిన ఈ సినిమా ఈనెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: