దేశంలో నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు ఎన్ని పోల్స్ పెట్టినా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఆర్మాక్స్ సర్వే 2024 సెప్టెంబర్ కు సంబంధించిన ఫలితాలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. విజయ్ గత సినిమా ది గోట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా విజయ్ మాత్రం టాప్ లో నిలవడం కొసమెరుపు.
 
టాలీవుడ్ స్టార్ హీరో, బాక్సాఫీస్ బాద్ షా ప్రభాస్ కు ఈ లిస్ట్ లో రెండో స్థానం దక్కింది. ప్రభాస్ కు సెకండ్ ప్లేస్ దక్కడం అభిమానులకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. వరుస విజయాల ప్రభాస్ రాబోయే రోజుల్లో హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కు రెండో స్థానం దక్కడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందనే సంగతి తెలిసిందే.
 
ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ మూడో స్థానంలో అజిత్ నాలుగో స్థానంలో ఉండగా ఎన్టీఆర్, బన్నీ, మహేష్ ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. పాన్ ఇండియా సినిమాలేవీ విడుదల కాకపోయినా మహేష్ కు ఈ జాబితాలో ఏడో స్థానం దక్కడం కొసమెరుపు. అక్షయ్ కుమార్ కు ఎనిమిదో స్థానం దక్కగా రామ్ చరణ్ కు ఈ లిస్ట్ లో తొమ్మిదో స్థానం దక్కింది. సల్మాన్ ఖాన్ కు ఈ జాబితాలో పదో స్థానం దక్కడం కొసమెరుపు.
 
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఏకంగా ఐదుగురు హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కడం హాట్ టాపిక్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపుతున్నారు. బాలీవుడ్ థియేటర్లు సైతం సౌత్ సినిమాలతో కళకళలాడుతుండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్స్ క్రేజ్ మాత్రం మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: