సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అన్నదానికి ఇది మరోక బెస్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి . నిన్న మొన్నటి వరకు జాన్ జిగిడి దోస్తుల్లా కలిసిపోయి ఉన్న హీరోయిన్స్ ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే బొగ్గు మానేలా ఫైర్ అయిపోతున్నారు. దానికి కారణం ఒక బిగ్ బడా పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలో ఒక పాత్ర కోసం ఒక బ్యూటీ ని అనుకున్నాక ఆ పాత్ర వేరొకరి చేతికి వెళుతూ ఉండొచ్చు. అది సర్వసాధారణమే . దానికి ఈజన్స్ కూడా ఎన్నెన్నో ఉన్నాయి . కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల విషయంలో అలాంటి సిచువేషన్ నెలకొంటే ..అది నిజంగా ఆ ఇద్దరు హీరోయిన్స్ కి చాలా చాలా టఫ్ జాబ్ అని చెప్పాలి .


అయితే ప్రెసెంట్ అలాంటి ఒక క్రిటికల్  సిచువేషన్ ని ఎదుర్కొంటున్నారు కన్నడ అక్క చెల్లెలుగా పిలిపించుకునే శ్రీలీల - రష్మిక మందన్నా. మనకు తెలిసిందే రష్మిక మందన్నా కన్నడ బ్యూటీ. శ్రీలీల కూడా కన్నడ బ్యూటీనే . ఇద్దరు కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్ గా మారారు. రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా మారిపోతే శ్రీలీల అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది . పలు సినిమాలతో బిజీబిజీగా  ముందుకు వెళ్తున్నారు ఈ బ్యూటీస్.



అయితే రామ్ చరణ్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం  సెకండ్ హీరోయిన్ గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట సుకుమార్ . అయితే రష్మిక మందన్నా కన్నా ఆ పాత్రకు శ్రీ లీల బాగుంటుంది అని కొంతమంది సజెస్ట్ చేయడంతో ఆమె ని  మళ్లీ ఆ పాత్రలో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారట సుకుమార్. అయితే ఆల్రెడీ రష్మిక మందన్నాతో చర్చలు కూడా జరిపారట సుకుమార్. ఇప్పుడు ఇదే పెద్ద మైనస్ గా మారింది . రెమ్యునరేషన్ పరంగా సుకుమార్ ఎవరు తక్కువగా ఓకే చేస్తే వాళ్ళను ఫైనలైజ్ చేయాలనుకుంటున్నారట.



రష్మిక మందన్నా ఒక సినిమాకి 7 కోట్లు తీసుకుంటుంది . శ్రీ లీల నాలుగు కోట్లు మూడు కోట్లు తీసుకుంటుంది . అయితే ఈ కారణంగా ఈ సినిమాలో ఆల్మోస్ట్ శ్రీలీల కన్ ఫాం అంటున్నారు జనాలు . ఇక్కడే వీళ్లకు పెద్ద గొడవ స్టార్ట్ అయ్యింది. ఏ విషయాన్ని అయినా రష్మికతో షేర్ చేసుకుంటూ చాలా క్లోజ్ గా ఉండేదట శ్రీలీల.  అయితే శ్రీలీలను చెల్లెలు గా భావించిన రష్మిక  అన్ని విషయాలల్లో హెల్ప్ కూడా చేసేదట. ఇప్పుడు చెల్లెలే అక్క ఆఫర్ దొబ్బేయడంతో సినీ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయని ఇప్పుడు ఇద్దరూ నిజస్వరూపాలు బయటపడబోతున్నాయి అని మాట్లాడుకుంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: