రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాజా సాబ్ మూవీ కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.

ఇకపోతే విడుదల అయిన 24 గంటల సమయంలో ఈ మోషన్ పోస్టర్ కి ఏకంగా 312.4 కే లైక్స్ లభించాయి. దానితో ఈ సినిమా మోషన్ పోస్టర్ కి ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాలలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన మోషన్ పోస్టర్లలో మంచి ప్లేస్ లో నిలిచింది. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మోషన్ పోస్టర్ కి విడుదల అయిన 24 గంటల్లో 359 కే లైక్స్ లభించాయి. దానితో ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక లక్స్ సాధించిన మోషన్ పోస్టర్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రాజా సాబ్ మోషన్ పోస్టర్ 312.4 కే లైక్స్ ను 24 గంటల్లో సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ మూవీ మోషన్ పోస్టర్ కు 24 గంటల్లో 253.6 కే లక్స్ లభించాయి.

దానితో ఈ సినిమా మోషన్ పోస్టర్ మూడవ స్థానంలో నిలిచింది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ మూవీ మోషన్ పోస్టర్ కి 24 గంటల్లో 195 కే లైక్స్ వచ్చాయి. దానితో ఈ మోషన్ పోస్టర్ నాలుగవ స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమా మోషన్ పోస్టర్ కి 24 గంటల్లో 164 కే లైక్స్ లభించాయి. దానితో ఈ మోషన్ పోస్టర్ ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: