రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మొదలు పెట్టి రెండేళ్ల దాకా అవుతుంది. సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మళయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి మొదట ఒక పోస్టర్ ఆ తర్వాత గ్లింప్స్ లాగా ప్రభాస్ స్టైలిష్ లుక్ రిలీజ్ చేశారు. ఇక రీసెంట్ గా ప్రభాస్ బర్త్ డే రోజు ఒక పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ కూడా వదిలారు.

ఐతే ఈ మోషన్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్స్ ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ బర్త్ డేకి కూడా టీజర్ రిలీజ్ చేయనందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. రెండేళ్ల నుంచి సినిమా తీస్తున్నారు రెండు నిమిషాల రష్ అది కూడా టీజర్ కట్ కి దొరకలేదా అని అనుకుంటున్నారు.

టీజర్ రిలీజ్ చేస్తే సినిమాపై బజ్ మరింత పెరుగుతుంది. కానీ రాజా సాబ్ టీం ఎందుకో ఆ విషయంలో వెనకబడుతుంది. హర్రర్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాగా రాజా సాబ్ మీద భారీ హైప్ ఏర్పడింది. మోషన్ పోస్టర్ కూడా మెస్మరైజ్ చేసింది. ఇంతకీ అసలు కథ ఏంటి ప్రభాస్ ఎందుకు మారుతి తో సినిమా చేశాడు అన్నది సినిమా చూస్తేనే కానీ చెప్పలేం. ఏది ఏమైనా ప్రభాస్ తో మారుతి ఒక వెరైటీ కథతో ఆడియన్స్ ని భయపెడుతూ నవ్వించడానికి వస్తున్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ సమ్మర్ కి ప్రభాస్ మార్క్ ఎంటర్టైన్ ఇస్తూ బాక్సాఫీస్ రికార్డులు కొట్టాలని ఫిక్స్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: