అవును, మీరుగాని ఆ సినిమాని ఒంటరిగా చూసారంటే తడిసిపోతుంది. అందుకే దయచేసి ఒంటరిగా ఎవ్వరూ చూడవద్దు. ఆ సినిమాని చూసేటప్పడు పక్కన ఫ్రెండ్స్ గానీ, పేరెంట్స్ గాని ఉండేలా చూసుకోండి. ఈమధ్య కాలంలో ఓటీటీలో విడుదలైన సినిమాలకు ప్రత్యేకమైన ప్రేక్షకులు బేస్ తయారయింది. ఓటీటీలు రావడంతోనే కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా థియేటర్స్‌లో మిస్ అయిన వారు ఓటీటీలో సదరు సినిమాలను ఆస్వాదిస్తూ ఉన్నారు.

అలా రిలీజైన సినిమానే ఇది. ఈమధ్య థ్రిల్లర్, సస్పెన్స్, హారర్, రొమాంటిక్ సినిమాలకు జనాదరణ పెరగుతుండడంతో డైరెక్టర్స్ కూడా ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. ఈ సినిమా అయితే ఓటీటీల్లో ట్రెండింగ్‌లో ఉన్న బెస్ట్ హారర్ మూవీలో ఒకటిగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఓ యువతి క్షుద్రపూజలు , కొన్ని అనుకోని శక్తుల కారణంగా.. వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో హత్యలు కూడా చేస్తూ ఉంటుంది. అయితే ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఈ హత్యల వెనుక దాగి ఉన్న నిజాలేమిటి? అని తెలుసుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగి ఆ హత్యల గురించి షాకింగ్ విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు.

ఇలా స్టోరీ మొత్తం ఊహించని ట్విస్ట్ లు, భయంకర సన్నివేశాలతో అదిరిపోతోంది అని చెప్పుకోవచ్చు. అసలు అతను ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు? అసలు ఆ అమ్మాయి అలా మారిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు హత్యలు చేస్తుంది? అనేదే అసలు కథ. ఈ ఆసక్తికరమైన అంశాలను చూడాలంటే మీరు ఆ సినిమాని చూడాల్సిందే. ఇంతకీ ఆ సినిమా పేరు ఏమిటంటే... "ది అకాలి" ఈ సినిమా డేటా బేస్ లో 9.1 రేటింగ్ దక్కించుకోవడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తమిళ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో నాజర్ కీలక పాత్రలో నటించారు. ఈ హారర్ మూవీ అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి సినిమా గత దశాబ్దకాలంలో మరొకటి రాలేదంటే మీరు నమ్మాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: