మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జెసి కుటుంబానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి హ‌వా  కనిపిస్తుంది గాని.. ఒకప్పుడు ఆయన అన్నా జెసి దివాకర్ రెడ్డి రాజకీయం మరో స్థాయిలో ఉండేది. ఆయన ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్.. ఆయన కోసం ఏం చేసినా అది సెన్సేషన్ గా అన్నట్టుగా ఉండేది. ఒకరకంగా రాయలసీమ రాజకీయాల్లో ఆయనది తిరుగులేని చరిత్ర అని కూడా చెప్పవచ్చు. అందుకే ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. దాదాపు 50 ఏళ్ళ రాజకీయం చేసి తాడిపత్రి సెంటర్ గా అనంతపురం జిల్లా రాజకీయాన్ని శాసించిన జేసి జీవితం ఇప్పుడూ సినిమా వాళ్ళ చేతిలోకి వెళ్ళబోతుందనే  టాక్ పొలిటికల్ గా బాంబు పేల్చింది.


అయ‌న రాజకీయ జీవితంలో ఎన్నో  ప్రభంజనాలు ఆటుపోట్లు అవమానాలు ఉన్నాయి.. అలాగే ఉద్యమ సమయంలో ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత అయినా పేల్చిన డైలాగ్ లు రాజకీయంగా ఎన్నో చర్చలకు కారణమయ్యాయి. అందుకే పాలిటిక్స్ లో ఆయన ఎప్పుడూ  సెన్సేషన్. అనంతపురం రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న జెసి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఆయన జీవితంలో పెను సంచనాలకు కొదవలేదు. ప్రధానంగా పరిటాల రవి హత్య క్ర‌ట‌లో జెసి దివాకర్ రెడ్డి హస్తం ఉందంటూ వచ్చినా ఆరోపణలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఆ విచారణలో జెసికి క్లీన్ చిట్ వచ్చింది.. అంతేకాదు పరిటాల రవి జీవితకథగా వచ్చిన రక్త చరిత్ర సినిమాలోను ఎక్కడా జేసి ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఉండవు.


అయితే ఇప్పుడు జేసి దివాకర్ రెడ్డి బయోపిక్ తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంటే అందులోనూ ఏం చూపించబోతున్నారు.. ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి అందరిలో ఏర్పడింది . ఆ బయోపిక్ లో అన్ని వాస్తవాలే ఉంటాయా అనే చర్చ కూడా మొదలైంది. రాయలసీమ రాజకీయాల్లో జెసి పాత్ర ఎంతో  కీలకం. అలాగే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీతో సంబంధాలు, విభేదాలు ఇలా చాలా అంశాలు టచ్ చేయాలి. ఇక మరి ఈ బయోపిక్ ను టాలీవుడ్ లో ఉన్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ చేయడానికి ముందుకు వచ్చిందని అంటున్నారు. అలాగే ఓ సీనియర్ దర్శకుడు ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేయబోతున్నారట. టాలీవుడ్ లో ఉన్న స్టాల్ హీరో జేసి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు టాక్ కూడా వినిపిస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారి ప్ర‌క‌ట‌న‌ కూడా రానుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: