టాలీవుడ్‌లో ఇటీవల నిర్మాత నాగవంశీ చేస్తున్న కామెంట్లు కొంత చర్చకి కారణం అవుతున్నాయి. ఆయ‌న‌ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారా.. అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల టికెట్ రేట్ల విషయంలో నాగవంశీ చేసిన కామెంట్లు బాగా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఒక్కో టిక్కెట్ రూ.1500 పెట్టిన తప్పు లేదని నాగవంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ రూ.1500 పెట్టి ఒక పేదవాడు ఒక నెలకు సరిపడా సరుకులు తెచ్చుకుంటాడని కూడా నాగ వంశీకి కౌంటర్లు పడ్డాయి. తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మాటలు మంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో బన్నీసినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి నాగ వంశీ చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ విమర్శలకు కారణం అవుతున్నాయి.


అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉన్నాయి.  పుష్ప 2 షూటింగ్ పూర్తయ్యాక దీని వివరాలు వెల్లడిస్తాం. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించి.. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. మార్చిలోనే అల్లు అర్జున్ షూటింగ్లో పాల్గొంటారని నాగవంశీ తెలిపారు. ఈ క్రమంలోనే రాజమౌళిని కార్నర్ చేస్తూ.. నాగవంశీ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి ఎన్నో సినిమాలు చేశారు. ఆయన కూడా టచ్ చేయ‌ని రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది. మంచి విజువల్స్ ఉంటాయి. ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం అని అన్నారు.


వాస్తవంగా చెప్పాలంటే రాజమౌళి ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయనకు కెరీర్‌లో అసలు అపజయం అన్నదే లేదు. బాహుబలి 1, బాహుబలి 2 తెలుగు సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిపోయాయి. త్రివిక్రమ్ కెరీర్లో ఎన్నో ఫ్లాప్‌లు ఉన్నాయి. అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ కెరీర్ను పాతాళంలోకి తొక్కేసింది. అరవింద సమేత కేవలం ఎన్టీఆర్ క్రేజ్‌తో ఆడింది. గుంటూరు కారం కూడా కమర్షియల్ గా ఫ్లాప్‌ సినిమా. మరి అలాంటిది త్రివిక్రమ్, బన్నీ సినిమా.. రాజమౌళి సినిమా కంటే చాలా గొప్పగా ఉంటుంది అన్నట్టుగా మాట్లాడటం చూస్తుంటే నాగవంశీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు అన్న చర్చలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: