- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లో చూడటానికి చాలా బాగుంటాయి. అయితే ప్రాక్టికల్గా అవి ఎంత ట్రై చేసినా వర్కౌట్ కావు. కొన్ని కాంబినేషన్లు మాత్రం చేతులు దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సౌందర్య కాంబినేషన్ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమాల్లోకి వచ్చి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాగా పాపులర్ అవుతున్న రోజులు అవి. అప్పుడే కొత్తగా ఇండస్ట్రీ లోకి వచ్చి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గోకులంలో సీత సినిమాలో నటించాడు.


పవన్ నటించిన మూడో సినిమా సుస్వాగతం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయింది. భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాను ఎంతో ఎమోషనల్ గా తెరకెక్కించారు. ఈ సినిమా క్లైమాక్స్ ఇప్పటికీ మర్చిపోలేము. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా హీరోయిన్ దేవ‌యాని నటించింది. ఆమె కంటే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా సౌందర్యని తీసుకోవాలని అనుకున్నారట. అయితే పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదట.


అంత గొప్ప నటితో నటించే ధైర్యం నాకు లేదు.. ఆమె నటన ముందు నా నటన తేలిపోతుంది. ఆమెకు బదులుగా వేరే హీరోయిన్ ని తీసుకోవాలని పవన్ కళ్యాణ్ మాత్రమే కోరారట. అయితే భీమినేని శ్రీనివాసరావు మాత్రం ఏమాత్రం వెనుకు తగ్గకుండా సౌందర్య అయితేనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు న్యాయం చేస్తుందని పట్టుపట్టారట. అయినా పవన్ ఒప్పుకోకపోవడంతో చివరకు తమిళంలో అప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్న దేవ‌యాని తీసుకొచ్చి సుస్వాగతం సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఫుల్ రన్‌లో ఏకంగా ఐదు కోట్లకు పైగా షేర్ రాబట్టింది అంటే ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: