ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాల్లో ది రాజా సాబ్ సినిమా ఒకటి. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు చిన్న చిత్రాలని మాత్రమే డైరెక్ట్ చేసిన మారుతి ప్రభాస్ తో కలిసి ఈ సినిమాని తీస్తున్నారు. ఈ సినిమా ఆరంభంలోనే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగినట్టుగా ప్రభాస్ గతంలో ఎప్పుడు చేయని విధంగా హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమాని చేయనున్నారు. దీంతో ఈ సినిమా కోసం అందరూ వేయిట్‌ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు.


ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా ఇద్దరు నటిస్తున్నారు.  మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి తెలిసిన వెంటనే ప్రతి ఒక్క ప్రభాస్ అభిమాని మారుతీతో సినిమా చేయడమేంటి ప్రభాస్ అని షాక్ అయ్యారు. దానికి గల కారణం బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్ చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు. అలాంటి ప్రభాస్ చిన్న డైరెక్టర్ మారుతీతో సినిమా చేయడం ఏంటని అందరూ ప్రశ్నించారు.


కానీ మారుతీపై నమ్మకంతో ప్రభాస్సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ పాత్రలు రెండే అయినప్పటికీ మూడు రూపాల్లో కనిపించనున్నాడు. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ వృద్ధుడిగా ఓ పాత్రను చేయనున్నారట. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. అంతేకాకుండా అతడి మనవడి పాత్రలో కూడా ప్రభాస్ చేయనున్నాడట. ఈ రెండు మాత్రమే కాకుండా ఆత్మగా ప్రభాస్ మరో పాత్రను కూడా చేస్తున్నాడని ఓ వార్త బయటకు వచ్చింది.


అంటే ఈ సినిమాలో ప్రభాస్ మూడు భిన్నమైన గెటప్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇంకా ఇందులో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి. మారుతి చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ మంచి కంటెంట్ ఉంటుంది. ఆ నమ్మకంతోనే ప్రభాస్ మారుతీతో సినిమా చేస్తున్నాడు. కనుక ఈ సినిమా బంపర్ హిట్ అవ్వాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: