పాన్ ఇండియా హీరో ప్రభాస్.. ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి మాత్రం అస్సలు చేసుకోవడం లేదు. ఇప్పటికే చాలామంది యంగ్ హీరోలు పెళ్లెప్పుడు అంటే ప్రభాస్ చేసుకున్నాక అని సరదాగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మరి ప్రభాస్‌ను  ఈ ప్రశ్న అడిగితే నేను సల్మాన్ ఖాన్ చేసుకున్నాక చేసుకుంటానని కౌంటర్ కూడా ఇస్తున్నాడు. రీసెంట్ గానే ప్రభాస్‌కు 45 సంవత్సరాల వచ్చాయి. అయినా ఇంకా పెళ్లి చూసుకోవటం లేదు. ఎప్పుడో చేసుకుంటాడో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు . అభిమానులు ఎప్పటికప్పుడు ఈ విషయం అడుగుతూనే ఉన్నారు .. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం రావట్లేదు. ఇక దీంతో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడనే నమ్మకం అభిమానంలో పోయింది . కాగా ప్రభాస్ మాత్రం సినిమాలు పైనే తన ఫోకస్ పెట్టి దూసుకుపోతున్నాడు. తన బ్యాచ్లర్ లైప్‌ను ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.


ఈ మధ్య ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ ఎంతో వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా ప్రభాస్‌ను ప్రేమించిన ఇద్ద‌రు హీరోయిన్లకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే ప్రభాస్‌ను నమ్ముకుని ఆయన్ని ప్రేమిస్తూ ప్రభాస్ లాగే బ్యాచ్లర్ లైఫ్ను కొనసాగిస్తున్నారు ఇద్దరు స్టార్ హీరోయిన్లు. అయితే వారు ప్రభాస్‌ను ప్రేమించారో లేదో తెలియదు కానీ 40 సంవత్సరాలు వచ్చినా కూడా బ్యాచిలర్ గానే ఉంటున్నారు. ఇక ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే త్రిష - అనుష్క .. య‌స్ ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రభాస్‌తో ప్రేమలో ఉన్నారట. అందుకే బ్యాచిలర్ గానే ఇప్పటికీ లైఫ్ కొనసాగిస్తున్నారు. అయితే వీరిలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఇద్దరు ఇల్లు కూడా కొన్నారని పెళ్లి తర్వాత అక్కడికి వెళ్ళిపోతున్నారని రూమర్లు కూడా వచ్చాయి. అయినా కానీ వీరు ఏమాత్రం ఈ విషయంలో స్పందించలేదు . ఇక ప్రభాస్ - అనుష్క బిల్లా , మిర్చి , బాహుబలి సినిమాల్లో నటించి మెప్పించారు.


ఇక త్రిష కూడా ప్రభాస్‌ను ప్రేమించిందని టాక్ ఉంది.. ఈమెకు కూడా 40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు.. ఇప్పటికే సింగిల్గానే ఉంటుంది. అలాగే హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఏకైక హీరోయిన్ త్రిష. ఇక ఏమే ప్రభాస్ తో వర్షం , పౌర్ణమి , బుచ్చిగాడు సినిమాలో నటించింది. ప్రస్తుతం వ‌రుస పాన్ ఇండియ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అలాగే టాలీవుడ్లో చిరంజీవికి జంటగా విశ్వంభర సినిమాల్లో నటిస్తుంది త్రిష. ఇలా అనుష్క - త్రిష ఇద్దరూ ప్రభాస్ ని ప్రేమించారని అందుకే ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నారని అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: