హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.. తమకు ఇష్టమైన హీరోయిన్స్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉంటారు. నెటిజన్స్ కూడా ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడ్డానికి ఎంతో  ఆసక్తి  చూపుతూ ఉంటారు. ఇలా హీరోయిన్ ఎవరో తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ సమయంలోనే ఓ హీరోయిన్ కు సంబంధించిన చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఆమె ఎవరంటే? ఆమె అందానికి మతి పోనీ కుర్రాడు ఉండడు.. తామర పువ్వు లాంటి కళ్ళు.. మత్తెక్కించే నవ్వు ఆమె సొంతం. ఇంతకీ ఆమె ఎవరు అంటే? స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.


సౌత్ హీరోయిన్ మాళవిక మోహన్.. ఆమె చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో మాళవిక పేరు మరోసారి హాట్‌ టాపిక్ గా మారింది. ఈమె గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మాళవిక మోహన్ 1992 ఆగస్టు్7న ముంబైలో  పుట్టింది. అలాగే ఆమె తండ్రి యూకే మోహన్ బాలీవుడ్ సినిమాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహన్.. ప్రస్తుతం ఈమె స్వస్థలం అయిన కేరళ బియ్యూర్‌లో  తన కుటుంబంతో ఉంటుంది.


మాళవిక హీరోయిన్గా పాన్ ఇండియా లెవెల్ అదరగొడుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ 2013లో వచ్చిన “బట్టం బోలే” చిత్రంతో మలయాళం లో అడుగు పెట్టింది. అలాగే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన పేట సినిమాలో నటించి కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది మాళవిక. ఇక తర్వాత దళపతి విజయ్ కు జంటగా లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకత్వంలో  వచ్చిన మాస్టర్ సినిమాలో నటించి మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా దర్శకుడు బి. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన “తంగళన్”లో మాళవిక మోహనన్ కీలక పాత్ర పోషించింది. మాళవిక ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈ బ్యూటీ రాణిస్తుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: