కన్నడ నటుడు కిచ్చా సుదీప్ గురించి తెలుగు వాళ్లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడిని పరిచయం చేసింది దర్శక ధీరుడు రాజమౌళి. జక్కన్న దర్శకత్వం వహించిన ఈగ అనే సినిమా ద్వారా సుదీప్ తెలుగు పరిశ్రమకి పరిచయం అయ్యాడు. కన్నడలో ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుదీప్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టం. అయితే ప్రస్తుతం కిచ్చా సుదీప్ తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే ఈయన తాజాగా తన తల్లిని కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ఇతర భాషలోని నటీనటులు కూడా సుదీప్ కు ధైర్యం చెప్పారు.

ఇదిలా ఉండగా, సుదీప్ కి సంబంధించి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని మనసులో ఉన్న హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. ఇక ఆమె మరెవ్వరో కాదు.. హీరోయిన్ సమంత. ఓ యాంకర్ అతనితో మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు? సమంత, నయనతార, సాయి పల్లవి లేదా తమన్నా? అని అప్షన్లు ఇవ్వడంతో సుదీప్ ఠక్కున సమంత పేరు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘సమంత ఎప్పుడూ నా ఫేవరెట్‌. ఆమె ఒక అద్భుతమైన అమ్మాయి. ఆమె తనను తాను మరింత అందంగా, ప్రొఫెషనల్ గా మార్చుకుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

కాగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈగ మూవీతో సుదీప్ టాలీవుడ్ తెరకు పరిచయమయ్యాడు. ఇందులో విలన్ పాత్రలో సుదీప్ తెలుగు జనాలను భయపెట్టాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ కుర్రకారు మనసులను తన నటనతో దోచుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ మూవీ షూటింగ్ నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దాంతోనే సమంత పైన సుదీప్ కి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సమంత తన సిటాడెల్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఈ వెబ్ సిరీస్ అతి త్వరలోనే రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: