కాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ తగ్గ మనినా తగ్గుతాడు పెరగమన్న పెరుగుతాడు . ఎంత రిస్కీ షాట్స్ అయినా డూప్ లేకుండా కూడా నటిస్తాడు . అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెల్లే సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారట . ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ కరెక్టు వెయిట్ లోనే ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన దేవర సినిమా కోసం ఏడు కేజీలు తగ్గాడు .
ఇప్పుడు దేవర 2 కోసం ఆయన బరువు పెరగడానికి చూస్తున్నారు . అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం ఏకంగా 10 కిలోల బరువు తగ్గమంటూ ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ చేశారట . దీంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు. దేవర 2 కి బరువు పెరగాలి ప్రశాంత్ నీల్ సినిమాకి బరువు తగ్గాలి.. ఇలా ఎలా ..? అంటూ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రశాంత్ నీల్ అడిగిన దానికి ఓకే చెప్పినట్లు సమాచారం అందుతుంది.
దేవర సినిమా షూట్ కంప్లీట్ అయిన వెంటనే ఆయన సపరేట్ డైట్ ఫాలో అవుతూ ప్రశాంత్ నీల్ సినిమా కోసం పది కిలోల బరువు తగ్గబోతున్నాడట . పది కిలోల బరువు తగ్గడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో కఠిన డైట్ వ్యాయామాలు ఉండాలి . ఈ సినిమా ఒక్కటే కాదు వార్ 2 సినిమా కూడా ఉంది . ఆ సినిమాని ఈ సినిమాని బ్యాలెన్స్ చేస్తూ వెయిట్ తగ్గడం అనేది చాలా చాలా టఫ్ఫస్ట్ జాబ్ . మరి తారక్ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అనేది తెలియడం లేదు . అయితే ఫ్యాన్స్ మాత్రం "వద్దు అన్నా ప్లీజ్.. అలా చేయకు" అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి తారక్ ఫాన్స్ రిక్వెస్ట్ వింటాడో లేదో..??