మొత్తం కథ చెప్పకుండా మూడు గంటలసేపు కూర్చోబెట్టి పెండింగ్ పెడుతున్నారు. మొదటి భాగంలో కథను బాగా సాగదీస్తున్నారు. రెండో భాగం కోసం తొలి భాగంలో కథను దాచిపెట్టుతూ సాగదీస్తూ నడిపిస్తున్నారు. ఇలాంటి సీక్వెల్స్ పట్ల ప్రేక్షక ఆదరణ తగ్గిపోతూ వస్తోంది. ఒక భాగంపై ఉన్నంత ఆసక్తి మరో భాగంపై ఉండటం లేదు. కేవలం బాహుబలి లాంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే.. సీక్వెల్‌గా వస్తున్న సినిమాపై ఆ స్థాయిలో అంచనాలు ఉండటం లేదు. అంత ఎందుకు సలార్ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు సలార్ 2 ఉంటుందని చెబుతున్నా.. పెద్దగా ఆసక్తి లేదు.
దేవర సినిమాకు కూడా ముందుగా మిశ్రమ స్పందన వచ్చింది. కేవలం ఎన్టీఆర్ చరిష్మాతో ఆ సినిమా కలెక్షన్‌లు వసూలు చేసింది. ఇక భారతీయుడు 2 సినిమా పెద్ద డిజాస్టర్. భారతీయుడు 3 ఉంటుందని ప్రకటించిన ఇప్పుడు ఆ సినిమా ఎవరు కొనరని డిసైడ్ అయ్యి చివరకు ఓటీటీలో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో 20 ఏళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ అయినా గజినీ సినిమాకు సిక్వెల్ అంటున్నారు. అల్లు అరవింద్, మధు మంతెన.. అమీర్ ఖాన్ సీక్వెల్ ఆలోచన ప్లాన్ చేస్తున్నారట.
ఒకేసారి హిందీ, తెలుగు, తమిళ భాషలో గజిని 2 తెరకెక్కిస్తారట. తెలుగు, తమిళ భాషలలో సూర్య. హిందీ వెర్షన్ లో అమీర్ ఖాన్ నటించేట్టు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు గజినీ సినిమా ఆడిన రోజులు కావు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో సినిమాలు తీస్తే అప్పట్లో నడిచాయి. ఇప్పుడు జనాలు సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. మరి ఎంతో ప్లాన్ తో తెరకెక్కిస్తే తప్ప గజిని ప్రేక్షకులను ఆకట్టుకోదు. మరి గజిని సీక్వెల్ సూపర్ డూపర్ హిట్ చేస్తారా.. లేదా చెడగొడతారా.. అన్నది చూడాలి.