ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అది ఏ రంగమైన సరే ..సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కాదు ..ఇంట్లో వర్క్ చేసే ఆడవాళ్లు కాదు ..బండి పెట్టుకొని కాయగూరలు అమ్ముకునే వాళ్ళు కాదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా పుష్ప2 గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు . డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ చేస్తాం అన్న సినిమాను డిసెంబర్ 5వ తేదీకి ఎందుకు షిఫ్ట్ చేశారు ..? త్వరగా పుష్ప2 రావడానికి ఏదైనా భారీ రీజన్ ఉందా..? సుకుమార్ ప్లాన్ వెనుక మర్మం ఏంటి ..? అసలు సుకుమార్ ఏం చేస్తున్నాడు..? అనే విషయాలను చర్చించుకుంటున్నారు .


అయితే సినీ విశ్లేషకులు అభిప్రాయం మాత్రం చాలా క్లారిటీగా ఉంది . పుష్ప2కి హైపర్ రావాలి అంటే ఏదో ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకోవాల్సిందే . అదే ఇది . ఏదో ఒక్క పిచ్చి నిర్ణయం తీసుకుని పుష్ప2కి నెగిటివిటీ క్రియేట్ చేయడం కన్నా జనాలను పలకరించే రోజు ఒక ముందుగానే వచ్చేస్తే బాగుంటుందిగా అంటూ సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారట . అందుకే డిసెంబర్ 5వ తేదీ ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారట . అంతేకాదు పుష్ప 2 సినిమాకి సంబంధించి కొన్ని వార్తలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా పుష్ప2కి మైనస్ గా మారబోతున్న ఒక విషయం హైలెట్గా మారింది .



గతంలో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఆర్య వన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే . ఈ సినిమా చాలా చాలా మందికి బాగా నచ్చేసింది . ఆ హైప్ తోనే ఆర్య2 తెరకెక్కించాడు.  కానీ ఆర్య 2  అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా యావరేజ్ గా మిగిలిపోయింది . ఇప్పుడు పుష్ప2 విషయంలో కూడా అదే అంటున్నారు జనాలు. పుష్ప వన్ మీద ఉన్న హైప్ తో పుష్ప2 తెరకెక్కించాడు. ఒకవేళ ఆ రీచ్ అందుకోలేక పోతుందేమో అంటూ జనాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.



మరీ ముఖ్యంగా పుష్ప వన్ కంటిన్యూషన్ కి స్టోరీ ఇంకేం ఉంటుంది ..? అనే డౌట్ ఒకటైతే.. పుష్ప 2 పై జరిగే ట్రోలింగ్ కూడా మరొకటి . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పుష్ప2కి కానీ ఆర్య 2 సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే కచ్చితంగా సినిమా ప్లాప్ అవుతుంది అని ..అప్పుడు బన్నీకి భారీ బొక్క తప్పదు అని ..ఆ నెగెటివిటీ రాకుండా నువ్వే చూసుకో సుకుమార్ అంటూ తమదైన స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. సుకుమార్ అంత తెలివి తక్కువ వాడు ఏం కాదు . తను ప్లానింగ్ లో తాను ఉంటాడు . పాస్ట్,  ఫ్యూచర్ ని లెక్కలు వేసే ప్రజెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తాడు సుకుమార్ అన్న సంగతి చాలామందికి తెలుసు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: