అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ రీసెంట్గా "దేవర" సినిమాతో అభిమానులను పలకరించింది. అఫ్కోర్స్ సినిమా టాక్ అటూ ఇటూ ఉన్నా కూడా ఆమె నటన పై మాత్రం మంచి మార్కులు దక్కించుకుంది . మరీ ముఖ్యంగా తన లుక్స్ విషయంలో ఫిదా చేసేసింది . స్టార్ హీరోయిన్ కూతురు జాన్వి కపూర్ అని కాకుండా జాన్వి కపూర్ తల్లి శ్రీదేవి అనే విధంగా తన లుక్స్ ను బాగా హైలైట్ చేసుకుంది . మరీ ముఖ్యంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జాన్వికపూర్ సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్త బాగా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది .
అయితే జాన్వి కపూర్ సర్జరీ చేయించుకోబోయేది మోకాళ్ళకి అంటూ తెలుస్తుంది . తనకి మోకాళ్ళ భాగం చాలా చాలా తీవ్రంగా నొప్పి పెడుతుందట . ఆమె కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అంట . ఈ క్రమంలోనే ఆమె మోకాళ్ళకి మైనర్ సర్జరీ చేయించుకోబోతుందట . త్వరలోనే ముంబైలోని ఒక బడా హాస్పిటల్ లో ఆమె ఈ సర్జరీ చేయించుకోబోతుందట . అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసుకునేసిందట . దీనిపై ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వార్తలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే జాన్వీ కపూర్ కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటి..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సర్జరీ కికేవలం 10 రోజుల రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని.. చాలా మైనర్ సర్జరీ అంటూ తెలుస్తుంది . ఈ వార్త ఇప్పుడు జాన్వికపూర్ అభిమానులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది..!