అంతేకాదు యానిమల్ సినిమాలో ఆమె పర్ఫామెన్స్ చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయిపోయారు. ఆ విషయాన్ని ఓపెన్ గానే పబ్లిక్ గా చెప్పుకొచ్చేశారు. కాగా రీసెంట్గా రష్మిక మందన్నా కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన్నా డైరెక్టర్స్ కు కొత్త కండిషన్ పెడుతుందట . మరీ ముఖ్యంగా సినిమాకి కమిట్మెంట్ ఇవ్వాలి అంటే కచ్చితంగా హాఫ్ రెమ్యూనరేషన్ ముందే తీసుకునే రష్మిక మందన్నా.. ఇప్పుడు ఏకంగా రెమ్యూనరేషన్ ని 10 కోట్ల కు పెచేసిందట.
బాలీవుడ్ వాళ్ళు 10 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉండడం గమనార్హం. అయితే తెలుగులో మాత్రం ఆమెకు అంత ఇవ్వలేమంటూ డైరెక్టర్ లు చేతులెత్తేస్తున్నారట . అలాంటి సినిమా ఆఫర్స్ ని ఎన్నో వదులుకునేసిందట రష్మిక . పది కోట్లు ఇస్తే సినిమా ఓకే చేస్తాను అంటూ ఓపెన్ గానే చెప్తుందట . రష్మిక మందన్నా కాల్ షీట్స్ బుక్ చేసుకోవాలనుకున్న డైరెక్టర్స్ అయోమయ స్ధితిలో పడిపోయారు. అసలు రష్మిక మందన్నా ఎందుకు ఇలా చేస్తుంది ..? అంటూ బాధ పడిపోతున్నారు జనాలు. సినిమా హిట్ అవ్వాలి అనుకోవాలే కానీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం సరికాదు అంటున్నారు. స్టార్టింగ్ లో నీ కెరియర్ మర్చిపోయావా..? అంటూ ఫ్యాన్స్ కూడా ఆమెకు సజెషన్స్ ఇస్తున్నారు..!