చిత్ర పరిశ్రమలో ఏ హీరో అయినా, ఈ హీరోయిన్ అయినా సక్సెస్ అయిందంటే వారి టాలెంట్ , అదృష్టం కొంత అయితే వారిని మంచి మార్గంలో నడిపించే మేనేజర్లదె ముఖ్యపాత్ర ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోలు తీసుకునే బలమైన నిర్ణయాలు చేసే సినిమాలు వెనుక వారి కృషి ఎంతో ఉంటుంది. అలానే ఓ సూపర్ స్టార్ వెనక ఓ బలమైన పిల్లర్ గా ఉంది.. ఆయన కష్ట సుఖాల్లో అండగా నిలిచిన ఓ మేనేజర్ గూరించి ఇక్కడ తెలుసుకుందాం. ఓ చిన్న స్థాయి న‌టుడి గా కెరియర్ మొదలు పెట్టి .. బాలీవుడ్ కే బాద్షాగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కెరియర్ తొలి నుంచి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న మేనేజర్ పూజా దద్దానీ.. ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మ.. 2012 సంవ‌త్స‌రంలో షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రేడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో జాయిన్ అవ్వటం ద్వారా తన కెరీర్ను మొదలు పెట్టింది. ఆమె తన పనితీరుతో షారుక్ కు అత్యంత సన్నిహితంగా మారింది.


రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లో కీలకంగా మారిన పూజ ఆ తర్వాత ఓ మెట్టు ఎక్కి షారుక్ ఖాన్ మేనేజర్ గా కూడా మారింది. షారుక్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సమయంలోనూ, ఆయన వరస ప్లాప్‌లతో నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలోను ఆమె నైతికంగా ఆయన వెంటే ఉంది . అలాగే షారుక్ అంతర్గత విషయాల్లో కూడా సలహాలు ఇచ్చే కీలకమైన వ్యక్తిగా మారింది. ఇక షారుక్ ఖాన్ తన జీవితంలో అత్యంత వివాదాస్పదంగా మారిన తన కొడుకు ఆర్యన్ ఖాన్‌ డ్రగ్స్ కేసులో కూడా పూజ కీలక పాత్ర పోషించిందిని కూడా చెప్పుకుంటారు. మిడియాకు ఇచ్చే వివరాలు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఆమె వ్యవహరించారు ఆర్యన్ కేసులో పూజా వ్య‌వహ‌రించిన తీరు మీడియాలో హైలైట్ అవ్వడం తెలిసింది.


ఇలా షారుక్ ఖాన్ టీం లో అత్యంత కీలకంగా మారిన పూజా దద్దానికి భారి రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈమె చేసే సేవలకు గాను ప్రతి సంవత్సరం 10 నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అయితే బాలీవుడ్ లోని హీరోయిన్లకు ఏమాత్రం తీసిపొని విధంగా ఆమె లైఫ్ ఉంటుందని సినీ వర్గాలు కూడా అంటున్నాయి. ఇక పూజా దద్లానీ ఆస్తుల విలువ కూడా ఘనంగానే ఉంది. ఆమె ముంబై బాంద్రాలో విలాసవంతమైన ఇల్లు, అలాగే మెర్సిడెజ్ బెంజ్ కారు. భారీగా జ్యువెల్లరీ, ఇతర స్థిరాస్థులు కూడా ఉన్నాయని ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. తాజా అంచనా ప్రకారం ఆమె ఆస్తుల విలువ సుమారుగా 50 నుంచి 55 కోట్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: