ఇక గత కొద్ది రోజుల నుంచి ఆలియా భట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది . ఇక దీనిపై కొందరు  అందం కోసం సర్జరీలు చేయించుకోవడం వల్ల ఆలియా కు పక్షవాతం కూడా వచ్చింద ని కామెంట్లు చేస్తున్నారు .. తాజాగా ఈ విషయం పై అలియా భ‌ట్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ లెటర్ ను విడుదల చేసింది . నాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది ..

ఆ వీడియోలో క్రియేట్ చేసిన వారి దృష్టిలో నా నవ్వు వంకరగా ఉంది .. నేను మాట్లాడే విధానం కూడా భిన్నంగా ఉంది .. అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్నాను అలాగే వారి దృష్టిలో నాకు పక్షవాతం కూడా వచ్చింది .. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలు నాపై సృష్టించి మీరంతా వేడుక చూస్తున్నారా ? ఎలాంటి ఆధారాలు లేకుండా ఎదుటి వ్యక్తులపై ఇలాంటి తప్పుడు కామెంట్లు చేయటం నేరమని మీకు తెలియదా ? కేవలం మీ వ్యూస్ కోసం ఇలా చేయడంలో అర్థం లేదు అంటూ వారి పై విరుచుకుపడింది .  


ఇక ఇలాంటి కామెంట్లు చేసే వారి లో అమ్మాయిలు కూడా ఉండటం సిగ్గుచేటు .. ఈ పద్ధతి ని ఎప్పటికైనా మనుషులకు హానికరమే .. నా బాడీ నా ఇష్టం ఈ విషయం గురించి మీకు నేను చెప్పాల్సిన పనిలేదు .. అందం కోసం ప్రికాషన్స్ తీసుకుంటే మీకేం అవసరం మీరు ఎవరు నన్ను తప్పు పట్టడానికి . మీకేం హక్కు ఉంది . ఇలాంటి తప్పుడు వార్త‌లు క్రియేట్ చేస్తున్నారు అని వారి పై ఘాటుగానే మండి పడింది . ఆలియా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఇది చూసిన నెటిజ‌న్లు పలువురు సెలబ్రిటీలు ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: