సూర్య దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడు. తన కెరీర్‌ లో అనేక విభిన్న పాత్రలను పోషించి  ప్రేక్షకులను అలరించాడు. ఆయన నటించిన లాస్ట్ సినిమాల్లో గ్యాంగ్ తెలుగు సినిమా హిట్ అయింది. అయితే మళ్లీ ఇప్పుడు భారీ సినిమాతో తెరమీదకి రాబోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం “కంగువా”. ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా తమిళ్ నుంచి ఉన్న పలువురు స్టార్ హీరోస్ కి తెలుగు సినిమాల దగ్గర నుంచి కూడా ఆధారణ  భారీగానే ఉంది. ఇదిలా ఉంటే ఎప్పుడు నుంచి మంచి క్రేజ్ ఉన్న అతి తక్కువ మంది హీరోలలో కమల్ హాసన్, రజినీకాంత్ తో పాటుగా సూర్య కూడా ఒకరు. 

ఇక తమిళ్లో తాను చేసిన సినిమాలు కూడా ఎన్నో ఏళ్ళు గా తెలుగులో  రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధిస్తూ భారీ కలెక్షన్లను అందుకుంది. కాగా తాజాగా ఆయన ఇప్పుడు నటిస్తున్న కంగువా సినిమా ప్రమోషన్స్ కి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఇకపోతే తెలుగు అభిమానులు సూర్యకి చూపిస్తున్న ప్రేమను చూసి ఆయన ఒక్కింత ఎమోషనల్ కూడా అయిపోయారు. సూర్య నటించిన హిట్ సినిమాలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీస్ లో తెలుగు ఆడియన్స్ భారీ వసూళ్లను రాబట్టారు. దాంతో ఇప్పుడు కాంగువా సినిమాపై కూడా భారీ బజ్ గట్టిగానే మొదలైంది అని చెప్పవచ్చు.

 ఈ చిత్రానికి టాక్ గాని పడితే సూర్య మళ్ళీ తెలుగులో పూర్వ వైభవం చూపిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి దాంతో సూర్య కచ్చితంగా ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉండదా ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: