తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. తనదైన కథన శైలితో యూత్ ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కలిసి పని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కాంబోలో వచ్చే కూలీ సినిమా పై రోజు రోజుకి అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక లోకేష్ ఆయన నటీనటులతో ఈ సినిమాకి సంబంధించిన పనులను శరవేగంగా సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటంటే లోకేష్ కనగరాజ్, రజినీకాంత్‌ తో కలిసి చేయబోయే సినిమా  ముందు వేరే కథ అంటూ.

 కానీ అది డెవలప్ చేసే సమయంలో కొంచెం ప్రెజర్ ఫీల్ అవ్వడం వల్ల లోకేష్ అది కాకుండా కూలీ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా కూలీ స్క్రిప్ట్ కి కూడా లోకేష్ ఎక్కువగానే సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కూడా ఈ స్క్రిప్ట్ గురించి రజనీకాంత్ కు స్క్రిప్ట్ రాయడం చిన్న విషయం కాదని అది చాలా ఒత్తిడితో కూడిన విషయమని తెలిపారట. ఇక ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగలు అవుతుంది. 

ఇది ఇలా ఉంటే లోకేష్ కనగరాజ్ తనదైన శైలిలో రజనీకాంత్‌ను ప్రేక్షకుల ముందు ప్రదర్శించాలని భావించారు. అంతేకాకుండా రజనీకాంత్ కెరీర్‌ లో ఇంతకు ముందు ఎప్పుడూ చేయని ఓ రకమైన పాత్రలో నటింపజేయాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలోనే రజనీకాంత్‌ను యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా భావోద్వేగాలను కలిగించే పాత్రలో కూడా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇకపోతే రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కలయిక తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.ఇక రజినీకాంత్ అభిమానులు అంత ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చుస్తునారు.

మరింత సమాచారం తెలుసుకోండి: