నివేదా థామస్ అనే పేరు తెలుగు సినీ ప్రేమికులకు అంత పరిచయం అక్కర్లేదు. తన అందమైన ముఖం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ నటి తక్కువ సమయంలోనే తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతి సినిమాలోనూ తన పాత్రకు న్యాయం చేస్తూ విభిన్న పాత్రలను పోషించింది. కామెడీ, రొమాంటిక్, ఎమోషనల్  అన్ని రకాల పాత్రలను సమర్థవంతంగా పోషించి తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది నివేదా థామస్. ఇకపోతే ఆమె నటించిన ప్రతి సినిమా కూడా ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

 అలాంటి సినిమాల్లో '35 చిన్న కథ కాదు' కూడా ఒకటి. నివేదా థామస్ యువ నటుడు విశ్వదేవ్ రాచకొండ కాంబినేషన్లో దర్శకుడు నంద కిషోర్ ఈమని తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ లో కూడా భారీ సక్సెస్ ను అందుకోగా తాజాగా ఓ ప్రముఖ అవార్డ్స్ వేడుకలకు ఈ సినిమా ఎంపిక కావడంతో చిత్ర యూనిట్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది గోవాలో జరుగుతున్న ప్రముఖ ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లోకి తెలుగు సినిమా సైడ్ నుంచి 35 చిన్న కథ కాదు సినిమా అఫీషియల్ గా ఎంపిక కావడం జరిగింది.

 ఇక ఈ విషయం తెలుసుకున్న నివేదా థామస్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ హిట్ సినిమాకి వివేక్ సాగర్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా సృజన్, సిద్ధార్థ రాళ్లపల్లి నిర్మాణం వహించారు. అంతేకాకుండా యువ రామా నాయుడు దగ్గుబాటి సమర్పణలో ఈ సినిమా విడుదల కి వచ్చింది. ఇది ఇలా ఉంటే నివేదా థామస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: