గతంలో సీఎం చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కూడా బాలయ్య నిర్వహించిన అన్ స్టాపబుల్ షో కి రావడం జరిగింది.. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాలు, కుటుంబానికి సంబంధించి అలాగే జైలు జీవితం పవన్ కళ్యాణ్ తో మీటింగ్ కూటమి పొత్తు ఇలా ఎన్నో అంశాల పైన చర్చించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబుని సుమారుగా 53 రోజులపాటు జైలులో జీవితాన్ని కూడా గడిపించేలా చేశారు. ఆ సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబుని కలిశారు.


అయితే ఆ తర్వాత బయటకు వచ్చి టిడిపి జనసేన ఆలయన్స్ గా దిగబోతోంది అంటూ తెలియజేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికలలో టిడిపి ,జనసేన, బిజెపి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనే విషయం పైన ఇటీవలే అన్ స్టాపబుల్-4 సీజన్ కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా రావడంతో బాలయ్య ఈ ప్రశ్న వేశారు.. అందుకు చంద్ర బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లోకేష్ వచ్చి జైలులో ఉన్నప్పుడు తనని కలిసారని..


పవన్ కళ్యాణ్ తనతో రెండు నిమిషాలు మాట్లాడాను.  ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ మీరు ధైర్యంగా ఉన్నారా సార్ అని అడిగాడు.  తన జీవితంలో నేనెప్పుడూ అధైర్య పడలేదు భయపడలేదు అని చెప్పాను.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ ఆ సమయంలో తెలియజేశారు.. అప్పుడే తానే ముందుగా పొత్తు ప్రతిపాదన తీసుకువచ్చానని తెలిపారు. ఈ విషయం మరొకసారి ఆలోచించి అందరం కలిసి పోటీ చేద్దామని పవన్తో చెప్పానని తెలిపారు చంద్రబాబు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించి ఓకే చెప్పేసారని. బిజెపి పార్టీని కూడా ఒప్పిస్తానని అలాగే ఒప్పించి కూటమిలోకి తీసుకువచ్చారని ఆ తర్వాతే వెళ్లి కూటమి ప్రకటన చేశారని అదే తమ విజయానికి నాంది అంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: