- అనుకోకుండా వచ్చి అద్భుత హిట్..
- 90S యూత్ ను ఆకట్టుకున్న మూవీ..
- వివాదాలకి కేరాఫ్ అడ్రస్..


 ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి సంబంధించిన టైటిల్ ని ముందుగానే  రిలీజ్ చేస్తారు చిత్ర యూనిట్. ఆ విధంగానే ఆరుగురు ప్రతివతలు మూవీ  టైటిల్ రిలీజ్ అయినప్పటి నుంచి మొదలు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి..  చివరికి సినిమాను బ్యాన్ చేయాలి అనే స్థాయి నుంచి అద్భుతమైన హిట్ సాధించే వరకు వెళ్లింది. ఇలా ఎన్నో వివాదాలు మధ్య కుర్ర కారు నుంచి మొదలు ముసలి వాళ్ళ వరకు రొమాంటిక్ ఫీల్ తెప్పించేలా చేసిందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రం రిలీజ్ సమయంలో వచ్చిన వివాదాలు ఏంటో ఆ వివరాలు చూద్దాం..

 ఆరుగురు పతివ్రతలు  వివాదం:
దర్శకుడు ఇవివి సత్యనారాయణ పేరు చెప్పగానే చాలామందికి కామెడీ చిత్రాలు గుర్తుకొస్తాయి. అలాంటి ఈయన తన పంతాను మార్చి ఆరుగురు ప్రతివతలు టైటిల్ తో సినిమా తెరకెక్కించారు. అయితే ఈవివి బ్యానర్ పై తన స్వీయ దర్శకత్వంలో 2004 ఫిబ్రవరి 6న విడుదలైంది. విడుదలైన కొన్నాళ్ల వరకు స్లోగా నడిచిన ఈ చిత్రం ఆ తర్వాత ఆధ్యాంతం అదరగొట్టేసింది. ఎంతోమంది సినిమా చూడడానికి పరుగులు పెట్టారు. యూత్ అయితే ఈ సినిమాను రెండు నుంచి మూడుసార్లు కూడా చూశారట. మొత్తానికి ఈ చిత్రం లో నటించిన అమృతకు మాత్రం విపరీతమైనటువంటి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత అమృతసినిమా లో కూడా నటించలేదు. అయితే ఇదే మూవీని రిలీజ్ చేసే సమయంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయట. ఇందులో ఉండే ప్రతి సీన్ ప్రేక్షకులను ఎంత ఆకట్టుకుందో అన్ని వివాదాలు వచ్చాయి. ముఖ్యంగా మహిళా సంఘాలు సినిమా గురించి ధర్నాలు నిర్వహించారు. టైటిల్ ఆడవాళ్లను అవమానించే విధంగా ఉందని కొందరు మహిళలు విరుచుకుపడ్డారు. చివరికి ఇవివి సత్యనారాయణ మీద కూడా దాడి జరిగింది. వైవాహిక జీవితాలను అవమానించే విధంగా సినిమాను తీశారని, ఇందులో చాలా సన్నివేశాలు ఆడవారిని అవమానించే విధంగా ఉన్నాయని అన్నారు. అంతేకాదు భర్తలను కూడా అవమానించే విధంగా సీన్స్ తీసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని వివాదాల మధ్య కూడా ఈవివీ సత్యనారాయణ ఈ సినిమాను రిలీజ్ చేసి అద్భుతమైన హిట్ సాధించారు. అలాంటి ఈ చిత్రం ఇప్పటికీ టీవీలలో వస్తే కన్నార్పకుండా చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: