తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటలలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశాడు. ఇక ఈయన నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈయన నటించిన సినిమాల టైటిల్స్ విషయంలో తెలుగు లో కాస్త గందరగోళం ఏర్పడుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... శివ కార్తికేయన్ కొంత కాలం క్రితం అయాలన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను తెలుగు లో కూడా ఇదే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో కొంత మంది ఆయలన్ అనేది తమిళ పదం. దానిని అదే టైటిల్ తో తెలుగు లో ఎలా విడుదల చేస్తారు ..? తెలుగు నేటివిటీకి తగ్గ టైటిల్స్ ను పెట్టొచ్చు కదా అనే వాదనను కొంత మంది వినిపించారు. చివరకి ఈ సినిమా మాత్రం అదే టైటిల్ తో విడుదల అయింది. కానీ ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను పత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా శివ కార్తికేయన్ "ఆమరాన్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాని తెలుగు లో కూడా అదే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దానితో చాలా మంది ఇది తమిళ్ నేటివిటీకి సంబంధించిన పదం. దీనిని అదే టైటిల్ తో తెలుగు లో ఎలా విడుదల చేస్తారు ..? తెలుగు నేటివిటీకి సంబంధించిన టైటిల్ తో ఈ సినిమాలు విడుదల చేస్తే బాగుంటుంది అనే ప్రతిపాదనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి శివ కార్తికేయన్ ఈ సినిమా విషయంలో అయిన కాస్త వెనక్కు తగ్గి ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గ టైటిల్ తో విడుదల చేస్తాడా ..? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk