సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో కమర్షియల్ గా భారీ హిట్ కాకపోయినా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలలో ఖలేజా ఒకటి. అతడు సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా 2010 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఖలేజా టైటిల్ ను ముందుగానే ఒక వ్యక్తి నిర్మాతల మండలిలో రిజిష్టర్ చేయించుకున్నారు.
 
తాను రిజిష్టర్ చేయించుకున్న టైటిల్ ను మహేష్ సినిమాకు ఫిక్స్ చేయడంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమా రిలీజ్ కాకుండా ఆర్డర్ ఇవ్వాలని సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి అన్ని పత్రాలను పరిశీలించి నష్ట పరిహారం ఎంత కోరుకుంటున్నారో చెప్పండి అని అన్నారు. మొదట 10 లక్షల రూపాయల పరిహారం కోరిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఏకంగా 25 లక్షల రూపాయల పరిహారం కోరారు.
 
ఖలేజా నిర్మాతలు మాత్రం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం పరిహారం ఇవ్వలేమని తెలిపారు. న్యాయమూర్తికి సైతం టైటిల్ రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తి అత్యాశ గురించి తెలిసి పూర్తి ఆధారాలతో రావాలని అప్పరివరకు పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఆ తర్వాత చిత్రయూనిట్ మహేష్ ఖలేజా అనే పేరుతో సినిమాను రిలీజ్ చేయడం జరిగింది.
 
టైటిల్ ను స్వల్పంగా మార్చి సినిమాను రిలీజ్ చేయడంతో టైటిల్ రిజిష్టర్ చేయించుకున్న వ్యక్తి సైతం ఏమీ చేయలేకపోయారు. ఖలేజా సినిమా అప్పట్లో 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఖలేజా సినిమాకు సింగనమల రమేష్ బాబు, సి.కళ్యాణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మహేష్ ప్రస్తుతం జక్కన్న సినిమాకు పరిమితమయ్యారు.




మరింత సమాచారం తెలుసుకోండి: