తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని తన ఖాతాల్లో వేసుకున్నాడు.. హీరో సూర్యకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు.. అయితే తెలుగులో మాత్రం సూర్యకు సెపెరేట్ ఫ్యాన్ బేస్ వుంది.. ఆయన నటించిన ప్రతి  సినిమా  తెలుగులో రిలీజ్ అయి మంచి విజయం సాధిస్తుంది.. ప్రస్తుతం సూర్య నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ ‘..సూర్య అభిమానులు చాలా కాలం నుండి ఒక భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. గడిచిన కొన్నేళ్ల నుండి సూర్య నటించిన ప్రతీ సినిమా అభిమానులను నిరాశ పరుస్తూ వస్తుంది..ముఖ్యంగా సూర్య కి తమిళ మార్కెట్ తో పాటు, తెలుగు మార్కెట్ కూడా ఎంతో కీలకం. వరుస ఫ్లాప్స్ కారణంగా తెలుగు లో కూడా ఆయన మార్కెట్ కాస్త డౌన్ అయ్యింది. అందుకే ఈసారి ఏకంగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అనే కసితో ‘కంగువ’ అనే చిత్రం చేసాడు

తమిళంలో స్టార్ హీరో అజిత్ కి వరుస సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.బాలీవుడ్ హాట్ బ్యూటీ దిషా పటాని హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్  విలన్ గా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది... సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.ఈ సినిమాలో సూర్య ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 13 డిఫరెంట్ గెటప్స్ తో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు ఉండనున్నట్లు సమాచారం.. స్క్రీన్ మీద సూర్య పెర్ఫార్మన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతారని మేకర్స్ చెప్పుకొచ్చారు.. అలాగే మైమరిపించే విజువల్స్ ఆడియన్స్ కి థియేటర్స్ లో అద్భుతమైన అనుభూతి కలిగిస్తుందని మేకర్స్ తెలిపారు.. కంగువ సినిమా నవంబర్ 14 న తెలుగు, హిందీ, తమిళం,కన్నడం మరియు మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: