బన్నీ ఎంత నిజాయితీపరుడో మీకు తెలియదా..? గతంలో మెగా ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ చేశారో.. మెగా ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా ఉన్నారు అనేది మీకు తెలియదా ..? వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో ఈ గోల ఏంటి .? కావాలని పుష్ప2 సినిమా అడ్డుకోవడానికి ఇలా చేస్తున్నారా..? అంటూ మండిపడుతున్నారు బన్నీ ఫాన్స్ . అయితే అలాంటివి పట్టించుకోకుండా బన్ని తన పని తను చూసుకోపోతున్నాడు . డిసెంబర్ 5వ తేదీ పుష్ప2 సినిమా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
సుకుమార్ దీనికి సంబంధించిన ప్లానింగ్ మొత్తం రెడీ చేసుకున్నాడు . త్వరలోనే పుష్ప2 సినిమాలోని ఐటెం సాంగ్ కూడా చిత్రీకరించబోతున్నారు . ఈ సాంగ్ లో శ్రద్ధా కపూర్ నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ లో చేయబోతున్నాడట సుకుమార్ . ఏ విషయానైనా సరే చాలా పక్కాగా లెక్కలు వేసుకుని చేయడం సుకుమార్ కి అలవాటే. అదే విషయాన్ని పుష్ప2లో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు .
కాగా ఇప్పుడు పుష్ప2 సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడింది . పుష్ప2 సినిమా హిట్ అవ్వాలని బన్నీ ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడట . పలువురు పండితులను పిలిచి ఆయన జాతకంలో ఉన్న దోషాలను తొలగించేలా ..పుష్ప2 సినిమా హిట్ అయ్యేలా ఆయన కెరీర్ కు ఈ సినిమా మరింత ప్లస్ అయ్యేలా పూజలు చేయిస్తున్నారట . దీనంతటికీ కారణం బన్నీ అమ్మగారు అంటూ తెలుస్తుంది. అయితే ఏ సినిమా విషయంలోనూ ఇలా హిట్ అవ్వాలి అంటూ బన్నీ ఇప్పటివరకు పూజలు చేయించలేదు . పుష్ప 2 కోసమే ఇలా చేయిస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది..!