సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో దళపతి విజయ్ ఒకరు. ఈ హీరో తమిళంలోనే కాకుండా తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. విజయ్ నటించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విజయ్ వారసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. కొద్ది రోజుల క్రితం లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.


సక్సెస్ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇందులో త్రిష కథానాయికగా నటించింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత హీరో విజయ్ తో త్రిష జతకట్టింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ లో భాగంగా వచ్చిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించింది. 2023లో అక్టోబర్ 19న ఈ సినిమా దసరా కానుకగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 550 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.


అయితే దళపతి విజయ్ నటించిన లియో సినిమా టైటిల్ పై వివాదం రాజుకుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగవంశీ చెప్పారు. తెలుగులో లియో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని మరొకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టు వారిని ఆశ్రయించారు. వారితో మాట్లాడమని చెప్పారు. ఆ సమయంలో లియో మేకర్స్ సదరు కేసు పెట్టిన వారితో ఒప్పందం చేసుకున్నారు.


వారికి రూ. 25 లక్షలు ఇచ్చి ఈ వివాదాన్ని సర్దుమనిగించినట్లుగా సమాచారం వచ్చింది. అయితే ఆ డబ్బులు తెలుగు రైట్స్ దక్కించుకున్న నాగవంశీ ఇచ్చాడా? లేక తమిళ్ మేకర్స్ ఇచ్చారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా డబ్బులు సెటిల్ చేసి సినిమా రిలీజ్ కు ముందే ఈ వివాదాన్ని ముగించుకోవడం చాలా మంచి పని అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి లియో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని విజయ్ కెరీర్ లోనే మంచి సక్సెస్ ఇచ్చిన సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: