ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ల జోరు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఏదైనా హీరో పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆయనకు సంబంధించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే కొన్ని సినిమాలకు రీ రిలీజ్ లో భాగంగా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ కూడా జనాల నుండి లభిస్తుంది. కొంత కాలం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మురారి సినిమాను ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ ని పెద్ద ఎత్తున ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీస్ చేయగా ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ఏకంగా మూడు సినిమాలను రీ రిలీస్ చేశారు. ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈశ్వర్ , మిస్టర్ ఫర్ఫెక్ట్ , సలార్ సినిమాలను రీ రిలీజ్ చేశారు. ఇకపోతే ఈ మూడు సినిమాలలో ఏదో ఒక సినిమా అయిన అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి సరికొత్త రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టిస్తుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఈ మూడు సినిమాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాస్త పరవాలేదు అనే స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. కానీ మిగతా రెండు సినిమాలు పెద్ద స్థాయి కోలక్షనను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టలేదు. దానితో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రభాస్ ఆఖరుగా కల్కి 2898 AD అనే సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: