బాల‌కృష్ణ‌ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షో గురించి జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా బాలయ్య తనలో ఉన్న మరో కోణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసాడు. సీరియస్ గా ఉన్న బాలయ్యలో సరదా కోణం బయటపడడంతో నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా, యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా అన్‌స్టాప‌బుల్ షోని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. దీనిని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ టెలికాస్ట్ చేయడంతో సదరు సంస్థకు బాగానే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో 3 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం సీజ‌న్ 4 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్ స్టార్ట్ కావడంతోనే ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఇక్కడికి అతిథిగా వ‌చ్చారు. ఈ నేపథ్యంలోనే వ్య‌క్తిగ‌త జీవితం, రాజ‌కీయాలు, ప‌వ‌న్‌తో పొత్తు వంటి ఎన్నో విష‌యాల‌ను చంద్ర‌బాబు పంచుకున్నారు.

కాగా ఈ క్ర‌మంలో బాల‌య్య ఓ కొంటె ప్రశ్నను అడగగా చంద్రబాబు చాలా సమయస్ఫూర్తితో సమాధానం చెప్పడం జరిగింది. బాలకృష్ణతో.. వీలున్నప్పుడు సినిమాలు చూసి రిలాక్స్ అవుతానని చంద్రబాబు చెప్పడంతో, అనుకున్నదే తడవుగా “మా చెల్లెలితో రొమాంటిక్ సినిమా చూసింది ఒకటి చెప్పండి” అని బాలకృష్ణ అడగడం జరిగింది. దాంతో బాబు “నువ్వు క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి” అని సరదాగా అన్నారు. మరలా బాబు మాట్లాడుతూ... “ఒక్కోసారి నాకు టైమ్ తక్కువగా ఉన్నప్పుడు నా భార్యతో కలిసి కూర్చొని నవ్వుతూ నీ సినిమాలు చూసి రిలాక్స్ అవుతూ ఉంటాను.” అని చంద్రబాబు చెప్పగా బాలయ్య నవ్వేశారు.

ఈ క్రమంలోనే బాలయ్య, బాబుని స్టార్ క్రికెటర్లుగా ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల్లో ఎవరు ఇష్టం అని అడుగగా.. కోహ్లీనే తాను ప్రిఫర్ చేస్తానని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇక ఈ షో ఆద్యంతం కూడా నవ్వులతో నిండిపోయింది. ఒకవైపు బాలయ్య వేసే ప్రశ్నలకు బాబు సమాధానం విన్న ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ, మధ్యమధ్యలో ఎమోషనల్ కూడా అవ్వడం ఈ షోలో మనం చూడవచ్చు. ఈ సందర్భంగా బాబు జైలులో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ చేసిన సపోర్ట్ గురించి చెబుతూ బాబు కన్నీళ్లు కార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: