యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా నటించగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ నాలుగు వారాల్లో ఈ సినిమా ఏ వారంలో ఏ రేంజ్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

సినిమా మొదటి వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 199.43 కోట్ల షేర్ ... 342.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

సినిమా 2 వ వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 34.54 కోట్ల షేర్ ... 65.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

సినిమా 3 వ వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 15.48 కోట్ల షేర్ ...26.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

సినిమా 4 వారం బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 4.59 కోట్ల షేర్ ... 8.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

4 వారాల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 254.04 కోట్ల షేర్ ... 443.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: