తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన కొంత కాలం క్రితం రాజా వారు రాణి గారు అనే మూవీ తో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన వరుస పెట్టి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అందులో చాలా తక్కువ శాతం సినిమాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇకపోతే ఆఖరుగా ఈయన రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత కాస్త ఎక్కువ సమయం తీసుకుని కిరణ్ "క" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ను కూడా తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ నుండి ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2 గంటా 31 నిమిషాల నిడివితో ప్రేక్షకులకు ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రన్ టైమ్ మరి ఎక్కువ కాదు ..? మరి తక్కువ కాదు. కానీ సినిమా కాస్త బోర్ కొట్టిన కూడా ఈ రన్ టైమ్ వల్ల ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: