సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమా ప్రేక్షకులకు సంక్రాంతి పండుగకు తోడుగా మరో పండగ వాతావరణం కలిసి వచ్చినట్లు అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తమకు ఇష్టమైన హీరోల సినిమాలు ఇదే సీజన్లో రిలీజ్ అవుతాయి కాబట్టి. అందుకే సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకోవాలని మూవీ మేకర్స్ సరిగ్గా ఈ సమయంలోనే పెద్ద పెద్ద సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అలా విడుదలైన సినిమాలు దాదాపుగా బిజినెస్ చేసేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి అదిరిపోయే సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి సీజన్ కూడా పెద్దపెద్ద సినిమాలతో పాటుగా సంబరాలు చేసుకోనుంది.
వాస్తవానికి ఈ సంక్రాంతికి ఆరు బడా సినిమాలు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా సినిమాలు అధికారికంగా కూడా ప్రకటించడం మనకు తెలుసు. అయితే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఒక్క గేమ్ చేంజర్ సినిమా తప్పితే మరొక సినిమా విడుదల డేట్ లను ప్రకటించడం జరగలేదు. అయితే మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రావడంతో మంచి ఖుషిగా ఉన్నారు. ఇక డేట్స్ ఇవ్వనప్పటికీ మరో మూడు నాలుగు సినిమాలు అయితే కొంచెం అటు ఇటుగా సంక్రాంతికి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత నాగ వంశీ చెబుతున్న ప్రకారం... హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కూడా సంక్రాంతి సీజన్ లోని రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు సందీప్ కిషన్ హీరోగా నటించిన 'మజాకా' సినిమా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన 'వామన' సినిమా, అదేవిధంగా నాగచైతన్య ఎన్నో ఆశలు పెట్టుకొని హీరోగా చేస్తున్న 'తండెల్' సినిమాలు కూడా విజయ సంక్రాంతి సీజన్ కి కాస్త అటు ఇటుగా రిలీజ్ కాబోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి ఈ సంక్రాంతి పండగ సినిమా ప్రేక్షకుల పండగ అని చెప్పుకోవచ్చు.