మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డులు క్రియేట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే సినిమా 500 కోట్లకు పైగా క్రేజ్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా వైజాగ్ హైదరాబాద్ వంటి బటా సిటీస్ లో ఒక్కో ధియేటర్లో రోజుకు లక్ష రూపాయలు గ్రాస్ ని కూడా రాబడుతుంది . ఇప్పుడు ఈ ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ లో కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ పడేలా ఉన్నాయి. అలాగే దీపావళి రోజు కోటి రూపాయలు షేర్ వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి కానీ ఈ స్థాయిలో లాంగ్ ర్యాన్ ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సింహాద్రి ఆది వంటి సినిమాలు కూడా ఇన్ని రోజులు కలెక్షన్స్ మెయింటైన్ చేయలేదు.


ఇక దేవర సినిమాకి ముందు ఆంధ్రలో సింగిల్ స్టేజ్ థియేటర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దానికి కారణం పెద్ద హీరోల సినిమాలు విడుదల కాకపోవటం దేవర మూవీ రీలిజ్ అయిన కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి కేవలం మూడు వారాలు మాత్రమే సినిమా ఆడాలి ఆ తర్వాత రన్ ఆగిపోతుంది అని కూడా అనుకున్నారు. కానీ ఈ స్థాయి థియేట్రికల్ రన్ వస్తుందని ఎవరు ఊహించలేద. అయితే ఇప్పుడు దేవర మూవీ 50 రోజుల సెంటర్ విషయంలో  కూడా ఆల్టైమ్ రికార్డును నెలకొల్పే అవకాశం ఉందని కూడా ట్రేడ్ పండితులు అంటున్నారు.


ఒక్క హైదరాబాద్ సిటీ లోనే ఈ సినిమా ప్రస్తుతం 60 థియేటర్స్ లో అడుతుంది. ఇక రాబోయో రోజులు పెద్ద సినిమాలు విడుదలే ఆవ‌కాశం లేదు కాబట్టి ఈ థియేటర్స్ నుంచి ‘దేవర’ ని తొలగించే చాన్స్‌ లేదు. కాబట్టి కేవలం హైదరాబాద్  లోనే 30 నుంచి 40 థియేటర్స్ లో అర్థ శతదినోత్సవం జరుపుకునే అవకాశం ఉంది. అలాగే నైజాం ఏరియా మొత్తం కలిపి 90 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందట. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 150 కి పైగా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోనుంది అని, మొత్తం మీద 240 డైరెక్ట్ సెంటర్స్ లో ఈ సినిమా 50 రోజులు ఆడుతుందని, ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల అన్నిట్లో ఇది ఆల్టైమ్ రికార్డుగా నిలిచిపోతుందని కూడా సినీ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: