ఇండియా లోనే గొప్ప దర్శకుడు గా పేరు తెచ్చుకున్న వారిలో శంకర్ ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు . ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి . దానితో ఈయన కు దేశం లోనే గొప్ప దర్శకుడిగా గుర్తింపు లభించింది . గత కొంత కాలంగా మాత్రం శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకోవడం లేదు . ఆఖరుగా ఈయన దర్శకత్వం వహించిన రోబో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన స్నేహితుడు , ఐ , రోబో 2.0 సినిమాలు యావరేజ్ విజయాలను అందుకోగా తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 మూవీ మాత్రం భారీ అపజయాన్ని ఎదుర్కొంది. తాజాగా శంకర్ "గేమ్ చేంజర్" అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోగా నటించగా ... తమన్ సంగీతం అందించిన. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం శంకర్ "అపరిచితుడు" అనే మూవీ ని తెరకెక్కించాడు. ఆ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాను హిందీలో రన్బీర్ సింగ్ హీరోగా రూపొందించాలి అని శంకర్ ప్లాన్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా స్టార్ట్ కాలేదు. ఇక ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా లేవు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: