మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కొత్త సినిమాలు వస్తు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మన అగ్ర హీరోల సినిమాలు విషయంలో మాత్రం వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక నిజానికి వాళ్లు చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా నడుచుకుంటూనే కాకుండా తమను స్టార్ హీరోలగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఏదేమైనా కూడా మన స్టార్ హీరోల మధ్య ఎక్కువ తక్కువ భావన అనేది ఎప్పుడూ ఉంటూనే వస్తుంది. వారు చేసే సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఇతర‌ హీరోలు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు.. ప్రేక్షకులను వారు ఎలా ఆదరిస్తున్నారు అనేది కూడా గమనిస్తూ ముందుకు వెళుతున్నారు.
 

మరి ఇలాంటి సమయంలో స్టార్ హీరోల అభిమానులు కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ యుద్దాలకు దిగుతున్నారు. ఇక అయితే టాలీవుడ్ లో నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలాగే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య మంచి స్నేహం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తరచూ కలుసుకుంటూ ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు.. అందువలన వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహ బౌండింగ్ కుదిరింది. ఇక నిజానికి ఎన్టీఆర్ - మహేష్ బాబుని అన్నా అని పిలుస్తూ చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు.. మహేష్ కూడా ఎన్టీఆర్ తో చాలా చనుగా వ్యవహరిస్తాడు వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ చూసి మిగిలిన హీరోలు కూడా కుళ్ళు కుంటున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇక్కడ నిజానికి మహేష్ కి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం.. చాలా హంబుల్ గా ఎలాంటి ఈగో లేకుండా ఎలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోకుండా తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. అలాగే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మ‌హేష్‌ కి ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టమట. ఇక సినిమాల పరంగా చూసుకున్నా కూడా ఎన్టీఆర్ సినిమాలు ఎంతో డిఫరెంట్ గా ఉంటాయి కెరియర్ మొదట్లోనే స్టార్ హీరోగా క్రేజ్‌ తెచ్చుకుని సినిమాలు చేశాడు.. అందుకే ఆయనంటే మ‌హేష్‌ కి చాలా ఇష్టమని కూడా చెప్పడం విశేషం…

మరింత సమాచారం తెలుసుకోండి: