తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమని ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే చాలా తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ బ్యూటీ భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మహిళా క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందింది. ఇకపోతే తమిళ్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సినిమాను తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి అనే టైటిల్తో రీమిక్ చేశారు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఐశ్వర్య రాజేష్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తమిళ్లో అద్భుతమైన విజయం సాధించిన కౌసల్య కృష్ణమూర్తి సినిమా తెలుగులో విజయం సాధించకపోవడానికి గల కారణాలను వివరించింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె మాట్లాడుతూ ... కౌసల్య కృష్ణమూర్తి సినిమా విడుదల అయిన వారం రోజులకు ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో సినిమా విడుదల అయింది. నేను ముందే చెప్పాను పెద్ద స్టార్ హీరో సినిమా విడుదలకు చాలా తక్కువ గ్యాప్ లో మన సినిమా ఎందుకు అని , వారు వినలేదు. సినిమా విడుదల చేశారు. 

ఇక సినిమా గురించి పాజిటివ్ టాక్ వచ్చి జనాలకు తెలుస్తున్న సమయం లోనే సాహో సినిమా విడుదల కావడంతో మా మూవీ ని థియేటర్ల నుండి తీసేశారు. దానితో మా సినిమా ఆడలేదు. ఇక ఆ తర్వాత జెమినీ టీవీ లో అనేక సార్లు ఈ సినిమాను ప్రసారం చేశారు. జెమినీ టీవీ ద్వారా మా సినిమాకు మంచి గుర్తింపు వచ్చింది అని ఐశ్వర్య రాజేష్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: