తాజాగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేకమైన పోస్టుని తెలియజేయడం జరిగింది. చిరంజీవి తన సినీ కెరీయర్ని మొదలుపెట్టింది డిగ్రీ చదువుకునే రోజుల్లో నట. ఆరోజుల్లో ఆయన రాజీనామా అనే తొలి సినిమా నాటకం వేశారట. ఈ నాటకానికి గాను మొదటిసారిగా నటుడుగా తనకు గుర్తింపు లభించింది అంటూ ఒక అవార్డు కూడా అందింది అంటూ తెలిపారు. తన 50 ఏళ్ల నటన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఫోటోని షేర్ చేశారు చిరంజీవి ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యపోతూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎవరైనా సరే పుట్టుక తో వచ్చిన మూలాలను మరిచిపోకూడదు అని చెబుతారు ఈ మాటను చిరు ఇప్పటికీ ఎప్పటికీ పాటిస్తూనే ఉంటారు. కెరియర్ తొలినాళ్లలో తనకు సినిమా ఆఫర్స్ అందించిన దర్శక నిర్మాతలు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన నటీనటులను కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు అంతేకాదు తన సినీ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను విమర్శలను కూడా ఆయన స్వీకరించారు అంతేకాదు తాను నమ్మిన సిద్ధాంతాలను ఇండస్ట్రీలోకి వచ్చే యువనటీనటులకు చెబుతూ వారికి తన వంతు ప్రోత్సాహం కూడా అందిస్తూ ఉంటారు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తూ ఉండడం గమనార్హం.