సమంతతో పెళ్లి తర్వాత నాగచైతన్య అమెతో కలిసి నటించినన మూవీ మజిలీ.. 2017లో రియల్ కపుల్ గా ఒక్కటైన వీరిద్దరూ సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత 2019 లో ఈ సినిమాలో నటించారు.  ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి క్లాసిక్ హిట్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత సంవత్సరానికే వీరిద్దరూ విడిపోయారు. శివ నిర్వాణ దర్శకత్వం లో వచ్చిన ఈ ఫ్యామిలీ లవ్ స్టోరీ కి ఆ సమయంలో  నుంచి మంచి స్పందన వచ్చింది ... భారీగానే కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మీరా అనే క్యారెక్టర్ ఎంతో కీలకం అన్న విషయం తెలిసిందే.. మీరా వచ్చాక హీరోయిన్ సమంత జీవితంలో మార్పులు వస్తుంది. ఇక మీరా క్యారెక్టర్ లో నటించిన ఆ చిన్నారి మీకు గుర్తుందా ? ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది ? ఎక్కడ ఉంది అనే విషయాలు ఇక్కడ చూద్దాం.


ఇంతకీ ఆమె ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కాదు .. హీరోయిన్ గా మారిపోయింది . ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు ఆమె పేరు అనన్య అగర్వాల్.. 2004లో ముంబైలో పుట్టిన ఈ భామ‌కు  ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చాయి. 2008 నుంచి ఈమె బుల్లితెరపై రాణిస్తుంది ఈ చిన్నది.. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్?, క్యా హువా తేరా వాద, మహా భారత్, సియా కే రామ్ వంటి సీరియల్లో నటించింది. అలాగే పలు యాడ్స్‌ కూడా చేసింది.


ఇక వెండితెరపై ఈమె నటించిన తొలి చిత్రం మజిలీ ఈ సినిమాలో చైతన్య మాజీ లవర్ కూతురుగా ఈమె నటించింది. ఈమె నటనకు ముప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. ఇక బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూనే సోషల్ మీడియాలో కూడా పలు బ్రాండ్స్‌ కి ప్రమోషన్లు చేస్తుంది ఈ ముద్దుగా ..  ఇన్‌స్టాలో యాక్టివ్ ఇవ్వండే ఈ అమ్మాయి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. అప్పటికీ ఇప్పటికీ ఈ అమ్మాయి షేపుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈమె అందాలకు సోషల్ మీడియా షేక్ అయిపోతుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: