తమిళ స్టార్ హీరో సూర్య గురించి తెలుగు జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా బాషలలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది. దాంతో ఈ సినిమాపైన చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కూడా అంచనాలు పెంచేయడంతో ఈ సినిమా అక్టోబరు 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది. అయితే మరోవైపు ఇతర సినిమాలు కూడా సరిగ్గా అదే తేదీన పోటీ ఉండడంతో సోలో రిలీజ్ కోసం ఈ వాయిదా పడిన ఈ సినిమా నవంబరు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం అయింది.

అయితే, తమిళంలో మాత్రం సోలో రిలీజ్ కి అవకాశం చిక్కింది కానీ, ఈ సినిమాకు తెలుగులో మాత్రం సోలో రిలీజ్ దక్కక పోవడం కొసమెరుపు. విషయం ఏమిటంటే, టాలీవుడ్లో కంగువ రిలీజ్ రోజున మెగా ప్రిన్స్ నటించిన మట్కా కూడా ఈ నవంబరు 14న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. వైరా ఫిల్మ్స్ వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను కలిపి నిర్మించడం జరిగింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘మట్కా’తో పాన్ ఇండియా మార్కెట్ లోకి  అడుగుపెట్టబోతున్నాడు. కాగా ఈ సినిమకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు.

సినిమా మాత్రమే కాకుండా, మరో యంగ్ హీరో, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు 'గల్లా అశోక్' నటించిన ‘దేవకి నందన వాసుదేవ’ సినిమా కూడా నవంబరు 14న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారకంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ సినిమా హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడంతో సినిమాపైన అంచనాలు మెండుగా ఉన్నట్టు కనబడుతోంది. దాంతో ఈ రెండు సినిమాలు నుండి సూర్య సినిమా పోటీ ఎదుర్కోక తప్పదన్నట్టు కనబడుతోంది. కాగా ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు సూర్య నటించిన కంగువ సినిమాపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: