నమిత కోలీవుడ్ సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవం అయినటువంటి నమిత కుష్బూ తర్వాత కోలీవుడ్ లో అంత ఫేమస్ అయినా నటి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈమె అందానికి దాసులైన ఎంతో మంది యూత్ ప్రేమతో గుడి కూడా కట్టించారు. అయితే అలాంటి నమిత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మల్లె తీగలా ఉండేది.కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే చాలా ముద్దుగా తయారైపోయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఈమె సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈమెను ఆదరించిన వాళ్లే లావైపోయాక విమర్శలు చేశారు.ఇక ఎంతోమంది ఆమెను విమర్శించేసరికి ఆ బాధ తట్టుకోలేక చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి మందుకు కూడా బానిస అయిందట. 

అదే సమయంలో నమితకి బ్రేకప్ కూడా జరిగేసరికి మరింత కుంగిపోయింది. కానీ చివరికి ఈమె పెళ్లి చేసుకొని కవలలకు జన్మనిచ్చింది.ఇదంతా పక్కన పెడితే అప్పట్లో హీరోయిన్ నమిత గురించి మీడియా ఒక పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది.ఎందుకంటే ఆమె రోజు రాత్రి నాలుగైదు గంటల పాటు ఊరి చివర ఉండే ఓ బంగ్లాకి వెళ్ళేది.అయితే ఇది గమనించిన మీడియా వాళ్ళు ఊరికే ఉంటారా.. ఉండరు..  కాబట్టి అసలు నమిత ఆ ఊరి చివర బంగ్లాలో ఏం చేస్తుంది అనే విషయం తెలుసుకోవడానికి ట్రై చేశారు.కానీ అది బయటపడకపోవడంతో స్ట్రింగ్ ఆపరేషన్ మొదలుపెట్టి నమిత ని ఫాలో అయ్యారు.

అయితే నమిత ఊరి చివర బంగ్లాలో చేసేదేంటో తెలిస్తే మీరందరూ నవ్వుకోవాల్సిందే.అదేంటంటే సాల్సా డాన్స్.. అవును మీరు వినేది నిజమే. నమిత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సన్నగా ఉండి ఆ తర్వాత లావుగా మారేసరికి అవకాశాలు రాకపోవడంతో సన్నబడాలని చూసింది. దాంతో సాల్సా డాన్స్ నేర్చుకుంది.ఇక ఈ సాల్సా డాన్స్ ఇంట్లో కాకుండా ఊరి చివర బంగ్లాలో ఓ టీచర్ దగ్గర నేర్చుకునేదట. దీంతో స్ట్రింగ్ ఆపరేషన్ లో ఈ విషయం తెలియడంతో ఇది కాస్త మీడియాలో సంచలనం సృష్టించింది. అలా నమిత ఏం చేస్తుందో తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా వాళ్ళు కూడా ఆమె చేసిన పనిని చూసి నవ్వుకున్నారట

మరింత సమాచారం తెలుసుకోండి: